నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం ‘కృష్ణ వ్రిందా విహారి’. ఇందులో తొలిసారిగా బ్రాహ్మణ యువకుడిగా నాగశౌర్య నటిస్తున్నారు. అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా టీజర్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. సోమవారం టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో నాగశౌర్య, హీరోయిన్ షెర్లీ సెటియా రొమాంటిక్ పోజులో కనిపిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో సీనియర్ నటి రాధిక ఒక కీలక పాత్ర పోషించారు. వేసవి కానుకగా ఏప్రిల్ 22న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. శంకర్‌ప్రసాద్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత: బుజ్జి.