'లూజర్ 2' ట్రైలర్ విడుదల

ABN , First Publish Date - 2022-01-14T16:22:51+05:30 IST

ప్రియదర్శి, ధన్యా బాలకృష్ణన్, కల్పికా గణేష్, శశాంక్, పావనీ గంగిరెడ్డి, హర్షిత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన 'జీ 5' ఒరిజినల్ సిరీస్ 'లూజర్ 2'. సూపర్ హిట్ సిరీస్ 'లూజర్'కు సీక్వెల్‌గా వస్తోంది.

'లూజర్ 2' ట్రైలర్ విడుదల

ప్రియదర్శి, ధన్యా బాలకృష్ణన్, కల్పికా గణేష్, శశాంక్, పావనీ గంగిరెడ్డి, హర్షిత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన 'జీ 5' ఒరిజినల్ సిరీస్ 'లూజర్ 2'. సూపర్ హిట్ సిరీస్ 'లూజర్'కు సీక్వెల్‌గా వస్తోంది. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తొలి సీజన్ తెరకెక్కింది. ఇప్పుడు 'లూజర్ 2'కు అభిలాష్ రెడ్డి, శ్రవణ్ మాదాల దర్శకత్వం వహించారు. దీనికి అభిలాష్ రెడ్డి క్రియేటర్. జీ5, అన్న‌పూర్ణ స్టూడియోస్‌, స్పెక్ట్ర‌మ్ మీడియా నెట్‌వ‌ర్క్క్‌ నిర్మించిన ఈ సిరీస్ ట్రైల‌ర్‌ను స్టార్ బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ కిదాంబి శ్రీ‌కాంత్ విడుద‌ల చేశారు. 'లూజర్ 2' ట్రైలర్ ఆద్యంతం ఆసక్తి కలిగించేలా ఉంది. విల్సన్ కుమారుడు క్రికెటర్ కావాలని అనుకోవడం... సూరి యాదవ్ ఫేమ్ వచ్చిన తర్వాత ఎలా మారాడు? రూబీ కథేంటి? అనేది ఆసక్తికరంగా చూపించారు. ఇందులో డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ నెల 21న 'జీ 5'లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.  


సూరి పాత్ర‌లో ప్రియ‌ద‌ర్శి, మాయ‌గా ధ‌న్యా బాలకృష్ణ‌న్‌, రూబీ పాత్ర‌లో క‌ల్పికా గణేష్, ఆమె తండ్రి ఇర్ఫాన్‌గా షాయాజీ షిండే, విల్స‌న్ పాత్ర‌లో శ‌శాంక్‌, జాన్‌గా హ‌ర్షిత్ రెడ్డి, గోవ‌ర్ధ‌న్ పాత్ర‌లో సూర్య‌, ప‌ల్ల‌విగా పావ‌నీ గంగిరెడ్డి, రుక్ష‌ణ‌గా స‌త్య కృష్ణ‌న్ న‌టించిన 'లూజ‌ర్ 2' ఒరిజిన‌ల్ సిరీస్‌కు శ్రీ‌ను, టిప్పు, అన్నీ ఇత‌ర పాత్రల్లో కనిపించబోతున్నారు.  స్పోర్ట్స్ డ్రామా జాన‌ర్‌లో రూపొందిన ఒరిజినల్ సిరీస్ 'లూజర్'తో వీక్షకుల మనసులు గెలుచుకుంది. ప్రజల కోరిక మేరకు ఇప్పుడు 'లూజర్ 2' వస్తోంది. ఇది కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందనే నమ్మకాన్ని మేకర్స్ వ్యక్తపరిచారు.  



Updated Date - 2022-01-14T16:22:51+05:30 IST