‘లూజర్ 2’లో రాజమౌళికి నచ్చిన సన్నివేశం అదే..

ABN , First Publish Date - 2022-01-29T23:40:01+05:30 IST

‘జీ 5’లో రీసెంట్‌గా విడుదలైన ‘లూజర్ 2’ సిరీస్‌ను దర్శకధీరుడు రాజమౌళి వీక్షించడమే కాకుండా.. ప్రశంసల వర్షం కురిపించారు. వీక్షకుల హృదయాల్లో బలమైన ముద్ర వేసిన సిరీస్ ‘లూజర్’. దీనికి సీక్వెల్‌గా ‘లూజర్ 2’ జనవరి 21 నుండి ‘జీ 5’లో స్ట్రీమింగ్

‘లూజర్ 2’లో రాజమౌళికి నచ్చిన సన్నివేశం అదే..

‘జీ 5’లో రీసెంట్‌గా విడుదలైన ‘లూజర్ 2’ సిరీస్‌ను దర్శకధీరుడు రాజమౌళి వీక్షించడమే కాకుండా.. ప్రశంసల వర్షం కురిపించారు. వీక్షకుల హృదయాల్లో బలమైన ముద్ర వేసిన సిరీస్ ‘లూజర్’. దీనికి సీక్వెల్‌గా ‘లూజర్ 2’ జనవరి 21 నుండి ‘జీ 5’లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఇందులో నటించిన శ‌శాంక్‌తో క‌లిసి రాజమౌళి ఈ సెకండ్ సీజ‌న్‌ను చూశారు. సిరీస్‌తో పాటు శశాంక్ న‌ట‌న‌ను ప్ర‌శంసించారు. ఈ విషయాన్ని శశాంక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘లూజర్ 2 చూడటంతో పాటు నా నటనను ప్రశంసించినందుకు థాంక్యూ. ఓల్డ్ విల్సన్ మేనరిజమ్స్ మీకు నచ్చడం సంతోషంగా ఉంది. మీకు సిరీస్ కూడా నచ్చడం ఇంకా ఇంకా సంతోషంగా ఉంది. ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోవద్దని జాన్‌ను విల్స‌న్ మోటివేట్ చేసే సీన్ రాజమౌళి‌గారికి నచ్చిన సన్నివేశం. అది స్ఫూర్తివంతంగా ఉందని చెప్పారు’’ అని శశాంక్ ట్వీట్ చేశారు. కాగా, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సై’ చిత్రంలో హీరో శశాంక్ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. 

 

ప్రియదర్శి, ధన్యా బాలకృష్ణన్, కల్పికా గణేష్, శశాంక్, పావనీ గంగిరెడ్డి, ప్రధాన పాత్రల్లో నటించిన ‘జీ 5’ ఒరిజినల్ సిరీస్ ‘లూజర్ 2’. తొలి సీజన్ తెరకెక్కించిన అభిలాష్ రెడ్డి... శ్రవణ్ మాదాలతో కలిసి ఈ రెండో సీజన్ తెరకెక్కించారు. జీ5, అన్న‌పూర్ణ స్టూడియోస్‌, స్పెక్ట్ర‌మ్ మీడియా నెట్‌వ‌ర్క్క్‌ నిర్మించాయి.



Updated Date - 2022-01-29T23:40:01+05:30 IST