తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

ABN , First Publish Date - 2022-09-28T14:11:45+05:30 IST

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి...

తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. ఈ తరుణంలో.. సెప్టెంబర్ 27న ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..


కోబ్రా (Cobra)

కోబ్రా అనేది 2022లో విడుదలైన తమిళ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. ఆర్.అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన.. ఈ చిత్రంలో 7 స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించాడు. చియాన్ విక్రమ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, ఇర్ఫాన్ పఠాన్, కేఎస్ రవికుమార్, మియా జార్జ్, మృణాళిని రవి కీలకపాత్రల్లో నటించారు.


ఇది భారతీయ మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌కి పరిచయ చిత్రం. అలాగే శ్రీనిధి శెట్టి మొదటి తమిళ చిత్రం. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. కోబ్రా పేరుతో ఓ వ్యక్తి గణిత నైపుణ్యాలను ఉపయోగించి హత్యలు చేస్తుంటాడు. అతన్ని పట్టుకోడానికి ఇంటర్‌పోల్ అధికారి అస్లాన్ ఇల్మాస్ (ఇర్ఫాన్) ప్రయత్నిస్తుంటాడు. విక్రమ్, ఇర్ఫాన్ మధ్య జరిగిన దోబుచులాటే ఈ చిత్రం. ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్‌లో ప్రసారమవుతోంది.


నెట్‌ఫ్లిక్స్ (Netflix)

Minions & More Volume 1 - ఇంగ్లిష్

Nick Kroll: Little Big Boy - ఇంగ్లిష్

Cry Babies Magic Tears Season 2 - ఫ్రెంచ్


అదర్ (Other)

Capital Talkies - ఒరియా




మిస్టర్ మాల్కంస్ లిస్ట్ (Mr. Malcolm's List) 

మిస్టర్ మాల్కంస్ లిస్ట్ అనేది ఎమ్మా హోలీ జోన్స్ దర్శకత్వం వహించిన 2022 పీరియాడికల్ డ్రామా. సుజానే అలైన్ రచించిన నవల ఆధారంగా తెరకెక్కించారు.ఇందులో ఫ్రీడా పింటో, సోప్ దిరిసు, ఆలివర్ జాక్సన్-కోహెన్, యాష్లే పార్క్, జావే ఆష్టన్, థియో జేమ్స్ ముఖ్యపాత్రల్లో నటించారు.


ఈ చిత్రం యునైటెడ్ స్టేట్స్, కెనడాలో జూలై 1, 2022న విడుదలైంది. యునైటెడ్ కింగ్‌డమ్ మరియు ఐర్లాండ్‌లో ఆగస్టు 26న విడుదలై మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.



Updated Date - 2022-09-28T14:11:45+05:30 IST