తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..
ABN , First Publish Date - 2022-10-18T14:12:43+05:30 IST
ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి...

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. ఈ తరుణంలో.. అక్టోబర్ 17న ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..
డొల్లు (Dollu)
పురాతన సంప్రదాయాలను సజీవంగా ఉంచడానికి తన డొల్లు బృందాన్ని తిరిగి ఒక చోటికి చేర్చడానికి డొల్లు డ్రమ్మర్, డ్యాన్సర్ అయిన భద్ర అనే యువకుడి పోరాటమే ఈ చిత్రం. పట్టణీకరణ ఈ చిన్న గ్రామాన్ని, దాని దేశీయ కళారూపాన్ని ఎలా ప్రభావితం చేసింది. దాని వల్ల జరిగిన పరిణామాలు ఏంటి అనేది చిత్ర కథాంశం. సాగర్ పురానిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో.. బాబు హిరనయ్య, కార్తీక్ మహేశ్, నిధి హెగ్డే ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఉనా బొక్కట డి'అరియా (Una boccata d'aria)
ఆర్థిక సమస్యల కారణంగా, సాల్వో తన సోదరుడు లిల్లోతో కలిసి వారసత్వంగా వచ్చిన ఫామ్‌హౌస్‌ను విక్రయించాలని నిర్ణయించుకుంటాడు. కాబట్టి అతను తన భార్య థెరిసా, పిల్లలతో మిలన్ నుంచి సిసిలీకి బయలుదేరతాడు. కానీ దాని కోసం సోదరుడిని ఒప్పించడం చాలా కష్టమైన పని. అది ఎలా చేయగలిగాడు అనేది ఈ ఇటాలియన్ చిత్ర కథాంశం. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

నెట్‌ఫ్లిక్స్ (Netflix)
Waffles + Mochi - టర్కీష్
