తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..
ABN , First Publish Date - 2022-11-08T13:40:20+05:30 IST
ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి...

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. ఈ తరుణంలో.. నవంబర్ 7న ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..
పాథోన్‌పథం నూట్టండు (Pathombatham Noottandu)
పాథోన్‌పథం నూట్టండు (పంతొమ్మిదవ శతాబ్దం) అనేది 2022లో విడుదలైన మలయాళం భాష డ్రామా యాక్షన్ చిత్రం. వినయన్ రచన, దర్శకత్వం వహించాడు. 19వ శతాబ్దపు ట్రావెన్‌కోర్ నేపథ్యంలో సాగే ఈ కథని సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు అరట్టుపుజ వేలాయుధ పనికర్ జీవితం ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రం నంగేలి, కాయంకులం కొచ్చున్ని కథను కూడా వర్ణిస్తుంది. ఈ చిత్రంలో సిజు విల్సన్, కయదు లోహర్, అనూప్ మీనన్, చెంబన్ వినోద్ జోస్, దీప్తి సతి, పూనమ్ బజ్వా, రేణు సౌందర్, సెంథిల్ కృష్ణ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
హేట్ యు రోమియో (Hate You Romeo)
హేట్ యు రోమియో అనేది కన్నడ వెబ్ సిరీస్. ఇది సక్కత్ స్టూడియోతో కలిసి శివరాజ్‌కుమార్ నిర్మాణ సంస్థ శ్రీముత్తు సినీ సర్వీస్ నిర్మించింది. ఈ సిరీస్‌లో ఒక్కొక్కటి 30 నిమిషాల ఏడు ఎపిసోడ్‌లు ఉంటాయి. అరవింద్ అయ్యర్, దిశా మదన్‌తో కలిసి ప్రధాన పాత్రలో నటించారు. దేవ్ అనే మోడల్‌కి అమ్మాయిల పిచ్చి ఉంటుంది. అతను అనుకోకుండా ఓ ఐలాండ్ చిక్కుకు పోతాడు. అక్కడి నుంచి ఎలా బయటపడ్డాడు అనేది ఈ వెబ్‌సిరీస్ కథాంశం. ఈ వెబ్‌సిరీస్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అదర్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
నెట్‌ఫ్లిక్స్ (Netflix)
Deepa & Anoop Season 2 - ఇంగ్లిష్

