తాజాగా OTTలో విడుదలైన సినిమాలు ఇవే..
ABN , First Publish Date - 2022-11-28T16:54:45+05:30 IST
ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి...

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. ఈ తరుణంలో.. నవంబర్ 28న ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..
కోచల్ (Kochaal)
శ్రీకుట్టన్ అనే వ్యక్తి చాలా పొట్టిగా ఉంటాడు. అతని పొట్టితనం వల్ల చాలామంది ‘కోచల్’ అని ఎగతాళి చేస్తుంటారు. దాంతో అతనికి చాలా కోపం వస్తుంది. అందుకే ఎలాగైన పోలీస్ ఆఫీసర్ అయ్యి తనని తాను నిరూపించుకోవాలని అనుకుంటాడు. అతని కల నేరవేరుతుందా లేదా అనేది ఈ ‘కోచల్’ చిత్రకథ. శ్యామ్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ శంకర్, షైన్ టామ్ చాకో, మురళీ గోపీ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.