తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

Twitter IconWatsapp IconFacebook Icon
తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోర్‌గా ఫీల్ అవుతున్న సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు. కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. కాగా సెప్టెంబర్ 21న ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..


Then Barbara Met Alan (దెన్ బార్బరా మెట్ అలాన్)..

దెన్ బార్బరా మెట్ అలాన్.. 2022 బ్రిటీష్ టెలివిజన్ డ్రామా ఫిల్మ్. డిసేబుల్డ్ పీపుల్స్ డైరెక్ట్ యాక్షన్ నెట్‌వర్క్, డిసేబుల్ యాక్టివిజం గ్రూప్ వ్యవస్థాపకులు బార్బరా లిసికి, అలాన్ హోల్డ్‌స్‌వర్త్‌కి పరిచయం ఏర్పడి ప్రమగా మారుతుంది. జాక్ థోర్న్, జెనీవీవ్ బార్ రచయితలుగా పనిచేసిన ఈ మూవీలో.. రూత్ మడేలీ, ఆర్థర్ హ్యూస్ నటించారు. ఇది 21 మార్చి 2022న BBC 2లో ప్రసారం అయ్యింది.


క్యాబరే డ్యాన్సర్స్ అయిన బార్బరా, అలాన్‌కి 1989లో జరిగిన ఓ ప్రదర్శనలో పరిచయం ఏర్పడి.. ప్రేమగా మారుతుంది. అనంతరం వారిద్దరు కలిసి డిసేబుల్డ్ పీపుల్స్ డైరెక్ట్ యాక్షన్ నెట్‌వర్క్‌ని స్థాపించి.. వికలాంగుల హక్కుల కోసం పొరాడతారు. అది చివరికి 1995లో వచ్చిన వైకల్య వివక్ష చట్టం రూపొందడానికి కారణమవుతుంది. ఉద్యమం ఉధృతంగా మారుతుంది. అయితే.. అదే సమయంలో ఆ జంటకి ఓ కొడుకు పుడతాడు. దాంతో వారిద్దరి మధ్య గొడవలు ప్రారంభమవుతాయి. దాన్ని ఎలా సరిచేసుకున్నారనేది ఈ చిత్ర కథాంశం.

తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..


నెట్‌ఫ్లిక్స్ (Netflix)

Strawberry Shortcake: Berry in the Big City Season 2 - ఇంగ్లిష్

The Real Bling Ring: Hollywood Heist - ఇంగ్లిష్

Designing Miami - ఇంగ్లిష్

Dahmer - Monster: The Jeffrey Dahmer Story - ఇంగ్లిష్, హిందీ

The Perfumier - ఇంగ్లిష్, జర్మన్, హిందీ

Fortune Seller: A TV Scam - ఇటాలియన్

Only For Love - పోర్చుగీస్

Iron Chef: Mexico - స్పానిష్


అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)

Hush Hush - హిందీ

Prisma - ఇటాలియన్, ఇంగ్లీష్


డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney Plus Hotstar)

Super/Natural - ఇంగ్లిష్

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.