'Liger': యూఎస్ షెడ్యూల్ పూర్తి..!

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా రూపొందిస్తున్న లేటెస్ట్ మూవీ 'లైగర్'. సాలా క్రాస్ బ్రీడ్ అనేది ఉప శీర్షిక. తాజాగా ఈ మూవీ యూఎస్ షెడ్యూల్ పూర్తైనట్టు సమాచారం. ఈ షెడ్యూల్‌లో లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ - హీరో విజయ్ దేవరకొండపై కీలక సన్నివేశాలను తెరకెక్కించినట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుందగా.. ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను పూరి జగన్నాథ్ - ఛార్మి కౌర్ - కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా, 'లైగర్' చిత్రాన్ని 2022 ప్రారంభంలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాతో విజయ్ భారీ హిట్ దక్కించుకుంటానని చాలా నమ్మకంగా ఉన్నాడు. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.