Liger: డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ‘లైగర్’ సంచలనం

Twitter IconWatsapp IconFacebook Icon
Liger: డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో లైగర్ సంచలనం

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh)ల కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా ‘లైగర్’ (Liger) (సాలా క్రాస్‌ బ్రీడ్). ఆగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ (Disney Plus HotStar)లో విడుదలై సంచలనం సృష్టిస్తోంది. ది గ్రేట్ మైక్ టైసన్ ‘లైగర్’ సినిమాతో ఇండియన్ సినిమాలో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. పూరి కనెక్ట్స్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.


తల్లి కల కోసం కరీంనగర్ నుంచి ముంబై చేరిన ఒక సాదా సీదా కుర్రాడు.. ఇంటర్ నేషనల్ ఎంఎంఏ ఫైటర్ అయిన ఒక స్ఫూర్తిదాయకమైన కథతో ఈ ‘లైగర్’ చిత్రం తెరకెక్కింది. మగ సింహం, ఆడ పులి జతకట్టినప్పుడు ఫలితంగా వచ్చే సంతానానికి పెట్టే పేరుతో వచ్చిన ఈ సినిమా.. టైటిల్‌తోనే దేశమంతా మాట్లాడుకున్న సినిమాగా నిలిచిపోయింది. ప్రపంచం అంతా ఎదురుచూసిన సినిమా ఇది. పాన్ ఇండియా (Pan India) సినిమాగా ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో అద్భుతమైన ఆదరణను చూరగొంటోంది.


డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో సెప్టెంబర్ 22 నుంచి ‘లైగర్’ స్ట్రీమింగ్ ప్రారంభమైంది. దర్శకుడు పూరి జగన్నాథ్ కథ, సంభాషణలు, ప్రతి పాత్ర తీర్చిదిద్దిన తీరు, సంగీతం, విజయ్ దేవరకొండ నటన.. అన్నిటినీ ఒక ఫుల్ ఫామిలీ ఎంటర్ టైనర్‌లా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. సెంటిమెంట్, ఎమోషన్, యాక్షన్, లవ్ అన్నీ సమపాళ్లలో కలిసిన ఈ సినిమా చూడడం కుటుంబం మొత్తానికి  ఒక పెద్ద రిలీఫ్. ప్రతి ఒక్కరు చూడాల్సిన ఈ సినిమా ఇప్పుడు కేవలం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. 


‘లైగర్’ని ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: Click Here

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.