టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannath) తొలి కలయికలో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ చిత్రం ‘లైగర్’ (Liger). ‘సాలా క్రాస్ బ్రీడ్’ దీనికి ట్యాగ్ లైన్. బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే (Ananya Panday) కథానాయికగా నటిస్తుండగా, రమ్యకృష్ణ (Ramya Krishna) కీలక పాత్ర చేస్తున్నారు. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో చిత్రం రూపొందింది. ఇందులో విజయ్ బాక్సర్‌గా అదరగొట్టబోతున్నాడు. ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ (Mike Tyson) విజయ్ తండ్రిగా నటించనుండడం విశేషం. ఇదివరకు విడుదలైన ఈ సినిమా టీజర్, సింగిల్స్, ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి హైపు క్రియేట్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుండడంతో ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేశారు.
ఇక ‘లైగర్’ చిత్రానికి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. చిత్రానికి U / A సర్టిఫికెట్ జారీ చేశారు. అయితే దీనికి రన్ టైమ్‌ను కొంచెం తక్కువగా ఫిక్స్ చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇలాంటి భారీ చిత్రాలకు కాస్తంత ఎక్కువగానే రన్‌టైమ్ సెట్ చేయడం ఆనవాయితీగా మారగా.. దీనికి కేవలం 140 నిమిషాల ప్రదర్శనా సమయాన్ని నిర్ణయించడం గమనార్హం. అంటే 2 గంటల 20 నిమిషాలన్నమాట. ఫస్టాఫ్ 1గంట 15 నిమిషాలు కాగా, సెకండాఫ్ 1 గంట 5 నిమిషాల రన్ టైమ్ వచ్చింది. ఏడు ఫైట్లు, ఆరు పాటలతో పూరీ ఈ సినిమాను పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దినట్టు సమాచారం. విజయ్ దేవరకొండ నటన అభిమానుల్ని మెప్పిస్తుందని చెబుతున్నారు.
బాక్సర్ పాత్రకోసం విజయ్ దేవరకొండ ఎంతో కష్టపడ్డాడు. గంటల తరబడి జిమ్‌లో కసరత్తులు చేసి సిక్స్ ప్యాక్ బాడీని సైతం బిల్డ్ చేశాడు. విజయ్ తన కెరీర్ లోనే తొలిసారిగా యాక్షన్ హీరోగా సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఇందులో విజయ్ తల్లిగా రమ్యకృష్ణ నటిస్తుండగా.. తల్లీకొడుకుల ఎమోషనల్ సీన్స్ అలరిస్తాయని చెబుతున్నారు. అలాగే.. విజయ్, అనన్యల లవ్ ట్రాక్ యూత్ కు బాగా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నారు. క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాకే హైలైట్స్ అని టాక్. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి.