సినిమా రివ్యూ : లైఫ్ ఆఫ్ ముత్తు (Life of Muthu).. పాతకథే మళ్ళీ చెప్పాడు..

ABN , First Publish Date - 2022-09-18T18:53:21+05:30 IST

గౌతమ్ వాసుదేవ మీనన్ (Gautam Vasudev Menon) సినిమాలు అంటే చూసే ప్రేక్షకులు వున్నారు. దర్శకుడు మణిరత్నం సినిమాలు ఎలా కొంచెం వైవిధ్యం తో వుంటాయో అలానే గౌతమ్ మీనన్ సినిమాలు కూడా.

సినిమా రివ్యూ : లైఫ్ ఆఫ్ ముత్తు  (Life of Muthu).. పాతకథే మళ్ళీ చెప్పాడు..

చిత్రం : లైఫ్ అఫ్ ముత్తు (Life of Muthu)

నటీనటులు : శింబు, సిద్ధి ఇద్నాని, రాధికా శరత్ కుమార్ తదితరులు 

సంగీతం: ఏ ఆర్ రహమాన్

సినిమాటోగ్రాఫర్: సిద్ధార్థ నూని

నిర్మాత : ఇషారి  కె గణేష్ 

దర్శకత్వం : గౌతమ్ వాసుదేవ్ మీనన్

-సురేష్ కవిరాయని 

గౌతమ్ వాసుదేవ మీనన్ (Gautam Vasudev Menon) సినిమాలు అంటే చూసే  ప్రేక్షకులు వున్నారు. దర్శకుడు మణిరత్నం సినిమాలు ఎలా కొంచెం వైవిధ్యం తో  వుంటాయో అలానే గౌతమ్ మీనన్  సినిమాలు కూడా. అందుకే అతని సినిమాలు రాగానే మొదటి రోజు చూసే ప్రేక్షకులు చాలామంది వున్నారు.  అతను ఇప్పుడు ‘లైఫ్ ఆఫ్ ముత్తు’ (Life of Muthu) అనే సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఇది తమిళ్ (Tamil) సినిమా Vendhu Thanindhathu Kaadu ని తెలుగుకి డబ్బింగ్ చేసి విడుదల చేసారు. ఇందులో శింబు (Simbu) లేక శిలంబరసన్ (Silambarasan) లీడ్ యాక్టర్ గా చేసాడు. తమిళ్ సినిమా విడుదల అయినా రెండు రోజుల తరువాత ఈ తెలుగు డబ్బింగ్ సినిమా విడుదల చేసారు. మరి సినిమా ఎలా ఉందొ, ఇందులో విషయం ఉందొ లేదో చూద్దాం. (LIfe Of Muthu telugu movie review )


కథ

ముత్తు(శింబు) అనే కుర్రాడు పోలవరంలో డిగ్రీ చదువుకుంటూ ఎదో చిన్నగా వ్యయసాయం చేసుకుంటూ వుండే ఒక పేదవాడు. ముత్తు అమ్మ (రాధికా శరత్ కుమార్ ) ముత్తు ని  సీతాపురం లో వున్న తన అన్న గొట్టిముక్కల ద‌గ్గ‌ర‌కు తీసుకువెళ్లి తన కొడుక్కి పని అడుగుతుంది. ముత్తుని అత‌ని మామ‌య్య ముంబైకి తీసుకెళ‌తానంటాడు. కానీ ముందు రోజు రాత్రి అత‌ను ఆత్మ‌హ‌త్య చేసుకుంటాడు. ముత్తు గది వెనకాల నుండి ఎక్కి చూసి మామయ్య ఆత్మహత్య చేసుకున్నాడని చూసి అతని ద‌గ్గ‌ర వుండే తుపాకీ తీసి దాచి పెట్టి, అప్పుడు తలుపులు తీస్తాడు. ఒక్కడే ముంబై వెళ్లాలని అనుకొ ని ముంబైలో మామయ్య చెప్పిన అడ్ర‌స్‌ వెంకన్న పరోటా షాప్ కి వెళ్లి అక్కడ పనిలో చేరుతాడు. అది పేరుకే ప‌రోటా షాప్‌, కానీ అక్కడ మాఫియా కి సంబందించిన గొడ‌వ‌లు అవుతూ ఉంటాయి.  కర్జి, కుట్టు భాయ్ అనే ఇద్దరు ముంబైలో మాఫియా నడుపుతూ వుంటారు. వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి. ముత్తు ఇవన్నీ చూసినా కూడా తన పని తాను చేసుకు పోతూ ఉంటాడు. ముత్తు పని చేస్తున్న షాప్ దగ్గరే బట్టల దుకాణం లో పనిచిస్తున్న పావ‌ని (సిద్ధి ఇద్నాని)తో ప్రేమ‌లో పడ‌తాడు. అమాయకంగా వుండే ముత్తు ఓ రోజు అనుకోకుండా తుపాకీ పట్టాల్సి వస్తుంది. అక్కడ నుండి కర్జి కి కుడి బుజం గా మారతాడు. ముత్తు కూడా మాఫియా లీడర్ గా మారాడా, అతని ప్రేమ పెళ్లి వరకు దారి తీసిందా లేదా, ముత్తు చివరికి  ఏమయ్యాడు అన్నదే మిగతా కాదాంశం. (LIfe Of Muthu telugu movie review )


విశ్లేషణ 

గౌతమ్ వాసుదేవ మీనన్ (Gautam Vasudev Menon) తెలుగు సినిమాలు కూడా చేసాడు, నాగ చైతన్యతో (Naga Chaitanya) రెండు చేస్తే అందులో ఏం మాయ చేసావే (Yeh Maya Chesave) హిట్ అయింది. అలాగే వెంకటేష్ (Venkatesh Daggubati) తో ఘర్షణ (Gharshana) చేసాడు, అది కూడా బాగా ఆడింది. ఇతను సినిమా తీసే, కథ చెప్పే విధానం వైవిధ్యం గా ఉంటుంది.  అందుకే ఇతని సినిమాలకి ప్రత్యేకంగా ప్రేక్షకులు వుంటారు. ఇతని సినిమాలు చూసి మనం నచ్చలేదు బయటకి వస్తే, ఇతని అభిమానులు ఆ నచ్చలేదు అన్న వ్యక్తిని అదోలా చూస్తారు. అదీ కాకుండా వాడికి సినిమా అర్థం కాలేదురా అని కామెంట్ కూడా చేస్తారు. అలంటి ప్రేక్షకులు తనిఖీ అభిమానులు, సినిమా బాగుంది అంటే వాడు ఒక మేధావి అన్నట్టుగా చూస్తారు. అదే ఈ వాసుదేవ మీనన్ సినిమాలతో వచ్చిన పేచీ. 


ఒక పల్లెటూరికి చెందిన శింబు అనే అబ్బాయి ముంబై  వెళ్లి అక్కడ అమాయకంగా చిన్న పని చేసుకుంటూ మాఫియా డాన్ గా ఎలా చెలామణి అయ్యాడు అన్నదే కథ. ఈ కథ ఎక్కడో విన్నట్టు వుంది కదా! మనం తీసిన కథలనే తిప్పి తిప్పి తెస్తాం. అంతే! ఈ కథ కూడా అంతే, ఇలాంటివి ఏనూ వచ్చాయి. అయితే గౌతమ్ మీనన్ కాబట్టి చిన్న ఆసక్తి అంతే ఎలా తీసాడో అని. నాకయితే ఫస్ట్ హాఫ్ అంతా చాలా బోర్ అనిపించింది. ముత్తు అనేవాడు వెంకన్న షాప్ లో అమాయకంగా షర్టు కలర్ తో ముక్కు మొహం తుడుచుకుంటూ (అది అలవాటు అనుకుంటా), ఒక మాఫియా డాన్ కి కుడి భుజంగా మారగానే ఈ అలవాటులన్నీ విచిత్రంగా పోతాయి. కథ అస్సలు నడవవు మొదటి సగం లో,  చాల బోర్ కూడా. అన్ని సీన్స్ బాగా సాగదీసాడు. దానికి తోడు ఇది కంప్లీట్ గా ఆరవ సినిమానే. ఆ డబ్బింగ్ లో  లిప్ సింక్ కాలేదు. వెనకాల నుండి ఎవడో డైలాగ్స్ చెప్తున్నట్టు ఉంటుంది. ఇంక సెకండ్ హాఫ్ లో ఏమి జరుగుతుందో ముందే ఊహించవచ్చు. అయితే మొదటి సగం కన్నా రెండో సగం కొంచెం బెటర్ గా తీసాడు. మధ్యలో పాటలు చొప్పించి కథని ఇంకా సాగ దీసాడు కానీ పరవాలేదు అనిపించాడు అంతే. నాకు గౌతమ్ మీనన్ సినిమాలంటే ఇష్టం. కానీ అతను తీసినవి అన్నీ బాగున్నాయి అని అనలేము కదా. ఈ సినిమాలో అయితే లాగ్ ఎక్కువ, ప్రతి సన్నివేశాన్నీ బాగా సాగదీసాడు అనిపించింది. ఏ ఆర్ రహమాన్ లాంటి పెద్ద సంగీత దర్శకుడు దీనికి సంగీతం అందించాడు కానీ, అది మామూలుగానే వుంది. సినిమాకి హెల్ప్ అవదు. కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అలాగే సినిమాటోగ్రఫీ, సాంకేతికంగా సినిమా చాల బాగుంది. శింబు కి ఇదో వైవిధ్యమయిన పాత్ర అతను బాగానే చేసాడు. సిద్ధి దినాన్ని చాల బాగుంది. ఆమె కళ్ళతో మంచి భావాలు పలికిస్తుంది, మంచి నటి అయ్యే అవకాశాలు చాలా వున్నాయి. మిగతా నటులంతా ఎక్కువ తమిళ నటులు అనుకుంటా. 


గౌతమ్ మీనన్ అంటే ఆసక్తిగా చూసే నాలాంటి వాళ్లకి ఇది కొంచెం నిరాస కలిగిస్తుంది. కొత్త కథ కాదు ఇది, ఇలాంటివి ఎన్నో వచ్చాయి. బాషా, నాయకుడు సినిమా తరువాత అలంటి కథలతో అటు తమిళ్ ఇటు తెలుగు లో ఎన్ని సినిమాలు అలాంటివి వచ్చాయి. అందువల్ల గౌతమ్ ఎందుకు మళ్ళీ అదే కథని ఎంచుకున్నాడు అనిపిస్తుంది. సినిమా అయ్యేముందు శింబుని గడ్డంతో ఒక మాఫియా డాన్‌లా  చూపించి రెండో పార్టు వుంది అంటూ చెప్పేశాడు. అయితే రెండో పార్టులో అయినా మొదటి దానిలో చేసిన తప్పులు చెయ్యకుండా తీస్తాడని ఆశిద్దాం. తెలుగు వాళ్ళకి ఈ సినిమా అంతగా ఎక్కక పోవచ్చు, ఎందుకంటే ఒక ఆరవ సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతుంది. (LIfe Of Muthu telugu movie review )

Updated Date - 2022-09-18T18:53:21+05:30 IST