ఆడుకుందామా లవ్వాట

ABN , First Publish Date - 2022-05-24T06:01:50+05:30 IST

ఆర్‌.కె.గాంధీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘లవ్వాట’. క్రిష్‌ బండిపల్లి కథానాయకుడు. మీరా కన్నన్‌, దీక్ష హీరోయిన్లు. ఎన్‌.వెంకటేశ్వర్లు, బొట్టా శంకర్రావు, వెంకటగిరి శ్రీనివాస్‌ నిర్మాతలు...

ఆడుకుందామా లవ్వాట

ఆర్‌.కె.గాంధీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘లవ్వాట’. క్రిష్‌ బండిపల్లి కథానాయకుడు. మీరా కన్నన్‌, దీక్ష హీరోయిన్లు. ఎన్‌.వెంకటేశ్వర్లు, బొట్టా శంకర్రావు, వెంకటగిరి శ్రీనివాస్‌ నిర్మాతలు. సోమవారం హైదరాబాద్‌లో ‘లవ్వాట’లోగోని ఆవిష్కరించారు. కథానాయకుడు క్రిష్‌ మాట్లాడుతూ ‘‘దర్శకుడు చెప్పిన కథ వింటే నేనే కాదు, ఎంత పెద్ద హీరో అయినా వెంటనే ఒప్పుకొంటారు. కథ అంత బాగుంది. చెప్పిన దానికంటే తెరపై ఇంకా బాగా వస్తుందని నా నమ్మకం’’ అన్నారు. ‘‘ఇంత మంచి కథలో హీరోయిన్లుగా అవకాశం రావడం ఆనందంగా ఉంద’’ని మీరా, దీక్ష తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘నా తొలి రెండు చిత్రాలు రుద్రాక్ష, రుద్రాక్ష పురం సెట్స్‌పై ఉండగానే నా మూడో చిత్రం టైటిల్‌ ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. ప్రేమపై యువతరం దృక్పథం ఎలా ఉందో వినోదాత్మకంగా చెప్పే కథ ఇద’’న్నారు. 


Updated Date - 2022-05-24T06:01:50+05:30 IST