నవ్వులు పంచే నయన్‌

దక్షిణాదిన లేడీ సూపర్‌స్టార్‌గా పేరుతెచ్చుకున్నారు కథానాయిక నయనతార. ఇప్పటిదాకా ఆమె భిన్న కథాంశాలతో రూపొందిన చిత్రాల్లో గ్లామర్‌ తారగా, గృహిణిగా, అమ్మవారిగా వైవిధ్యభరిత పాత్రల్లో ప్రేక్షకులను అలరించారు. త్వరలోనే ఆమె నవ్వులు పంచడానికి సిద్ధమవుతున్నారు. కథానాయిక ప్రాధాన్యంగా రూపొందే పూర్తిస్థాయి హాస్య చిత్రంలో ఆమె నటించనున్నారు. హాస్య దర్శకుడిగా పేరు తెచ్చుకున్న యువరాజ్‌ దయాళన్‌ దర్శకత్వంలో ఆమె ఫుల్‌లెంగ్త్‌ కామెడీ ఎంటర్టైనర్‌ చేయబోతున్నారని కోలీవుడ్‌ టాక్‌. యువరాజ్‌ చెప్పిన కథ నయనతారకు నచ్చడంతో సినిమా చేసేందుకు ఆమె అంగీకరించారట. అక్టోబర్‌లో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. ప్రస్తుతం నయనతార నటించిన ‘ఆరడుగుల బుల్లెట్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది. తమిళంలో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్‌’, ‘నేట్రికన్‌’, ‘అన్నాత్తే’ చిత్రాల్లో ఆమె నటిస్తున్నారు. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.