RRR: ‘ఆర్ఆర్ఆర్‌’ లేటెస్ట్ అప్‌డేట్‌!

ABN , First Publish Date - 2021-08-17T19:40:53+05:30 IST

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మోస్ట్ అవెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్‌(రౌద్రం ర‌ణం రుధిరం)’. ఈ సినిమా రిలీజ్‌పై నెట్టింట వినిపిస్తోన్న వార్తలపై చిత్ర యూనిట్ త్వరలోనే క్లారిటీ ఇవ్వనుందని సమాచారం...

RRR: ‘ఆర్ఆర్ఆర్‌’ లేటెస్ట్ అప్‌డేట్‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మోస్ట్ అవెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్‌(రౌద్రం ర‌ణం రుధిరం)’. ఈ ఏడాది ద‌స‌రా సంద‌ర్భంగా సినిమాను అక్టోబ‌ర్ 13న‌ విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్రకటించారు. అయితే సినిమా విడుదల మళ్లీ వెనక్కి వెళుతుందంటూ వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అందుకు కారణం.. ట్రిపుల్ ఆర్ పాన్ ఇండియా చిత్రం. భారీ బ‌డ్జెట్‌కు అనుగుణంగా భారీ స్థాయిలో విడుద‌ల చేస్తేనే మేక‌ర్స్‌కు వ‌ర్క‌వుట్ అవుతుంది. క‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌భావం త‌గ్గిన‌ప్ప‌టికీ దేశ వ్యాప్తంగా థియేట‌ర్స్‌కు ప్రేక్ష‌కులు ఆశించిన స్థాయిలో రావ‌డం లేదు. మ‌హారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో అయితే థియేట‌ర్స్ ఓపెన్ చేయ‌డంపై సందిగ్ధ‌త నెల‌కొంది. చాలా వ‌ర‌కు ఇలాంటి ప‌రిస్థితులు క‌న‌ప‌డుతుండ‌టంతో ట్రిపుల్ ఆర్ నిర్మాత‌లు సినిమాను వాయిదా వేసే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. 


ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్‌,ఎన్టీఆర్‌ల‌పై ఉక్రెయిన్‌లో సాంగ్‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ సాంగ్ చిత్రీక‌ర‌ణ ఆగ‌స్ట్ 19కి ముగుస్తుంది. యూనిట్ ఇక్క‌డ‌కు వ‌చ్చిన త‌ర్వాత మూడు నుంచి ఐదు రోజుల పాటు ప్యాచ్ వ‌ర్క్ షూటింగ్ ఉంటుంద‌ట‌. మ‌రోవైపు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. మొత్తం షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాత రాజ‌మౌళి వ‌ర్క్ ఎంత వ‌ర‌కు పూర్త‌య్యిందో బేరీజు వేసుకుని రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి దేశం యావ‌త్తు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ట్రిపుల్ ఆర్ ప్ర‌క‌టించిన తేదీకే వ‌స్తుందా?  లేక ప‌రిస్థితుల ప్ర‌భావంతో మ‌రోసారి వెన‌క్కి వెళుతుందా? అనేది తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే. ఇందులో మ‌న్యంవీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్‌, గోండు వీరుడు కొమురం భీమ్ పాత్ర‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్నారు. ఇంకా స‌ముద్ర‌ఖ‌ని, అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్‌, రే స్టీవెన్ సన్‌, ఒలివియా మోరిస్‌, అలిస‌న్ డూడి ఇలా బాలీవుడ్‌, హాలీవుడ్ తార‌ల‌తో సినిమా తెర‌కెక్కుతోంది. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వి.దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Updated Date - 2021-08-17T19:40:53+05:30 IST