Lakshya : ట్రైలర్ వచ్చేస్తోంది !

ABN , First Publish Date - 2021-11-28T18:12:36+05:30 IST

యంగ్ హీరో నాగశౌర్య ఎర్లియర్ గా ‘వరుడు కావలెను’ చిత్రంతో డీసెంట్ హిట్ అందుకున్నారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమా యూత్ కు బాగా కనెక్ట్ అయింది. ఇక ‘లక్ష్య’ సినిమాతో యాక్షన్ హీరో టాలీవుడ్ లో స్థిరపడే ప్రయత్నం చేస్తున్నారాయన . ఆల్రెడీ ‘అశ్వథ్థామ’ చిత్రంతో తొలి అడుగుపడింది. గతంలో ‘జాదూగాడు’ సినిమా విషయంలో యాక్షన్ హీరోగా మెరిసినప్పటికీ అంతగా మెప్పించలేకపోయారు. ఇప్పుడు ‘లక్ష్య’తో నాగశౌర్య లక్ష్యం నెరవేరుతుందని నమ్మకంగా చెబుతున్నారు మేకర్స్.

Lakshya : ట్రైలర్ వచ్చేస్తోంది !

యంగ్ హీరో నాగశౌర్య ఎర్లియర్ గా ‘వరుడు కావలెను’ చిత్రంతో డీసెంట్ హిట్ అందుకున్నారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమా యూత్ కు బాగా కనెక్ట్ అయింది. ఇక ‘లక్ష్య’ సినిమాతో యాక్షన్ హీరో టాలీవుడ్ లో స్థిరపడే ప్రయత్నం చేస్తున్నారాయన . ఆల్రెడీ ‘అశ్వథ్థామ’ చిత్రంతో తొలి అడుగుపడింది. గతంలో ‘జాదూగాడు’ సినిమాలో యాక్షన్ హీరోగా మెరిసినప్పటికీ అంతగా మెప్పించలేకపోయారు. ఇప్పుడు ‘లక్ష్య’తో నాగశౌర్య లక్ష్యం నెరవేరుతుందని నమ్మకంగా చెబుతున్నారు మేకర్స్. ఆర్చరీ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్ కు సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. ఇందులో విలుకాడుగా నాగశౌర్య అదరగొట్టబోతున్నారు. మేకోవర్ కోసం శౌర్య చాలా కష్టపడ్డారు. జిమ్‌లో గంటల తరబడి కసరత్తులు చేసి సిక్స్ ప్యాక్ బాడీ కూడా బిల్డ్ చేశారు. ఇంతకు ముందు విడుదలైన ‘లక్ష్య’ టీజర్, సింగిల్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


డిసెంబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా ‘లక్ష్య’ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ను స్పీడ్ అప్ చేశారు మేకర్స్. అందులో భాగంగా డిసెంబర్ 1న ‘లక్ష్య’ మూవీ ట్రైలర్ ను వదలబోతున్నారు మేకర్స్. ఈ విషయాన్ని ట్విట్టర్ లో ప్రకటిస్తూ ఓ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. కేతిక శర్మ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో సచిన్ కేడ్కర్, జగపతి బాబు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఏసియన్ సునీల్, శరత్ మరార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆర్చరీ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న మొదటి టాలీవుడ్ సినిమా కావడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. మరి ‘లక్ష్య’ మూవీతో నాగశౌర్య ఏ రేంజ్ లో లక్ష్యాన్ని ఛేదిస్తారో చూడాలి. 



Updated Date - 2021-11-28T18:12:36+05:30 IST