
‘‘అమ్మలారా.. అయ్యలారా.. ఇకముందు మీరు ఇలాంటి మోసాలు, కక్కుర్తి పనులు కోసం నా పేరు వాడినట్టు తెలిేస్త మాత్రం... మీ తల్లిదండ్రులు, భార్యబిడ్డలను, స్నేహితులను చెప్పులతో కొట్టించి టీవీ లైవ్ పెట్టించి మరీ సన్మానించబడును. దర్శకనిర్మాతల్లారా దయచేసి ఇలాంటి వాళ్ళని నమ్మకండి ఎందుకంటే... నా కేరాఫ్ నేను మాత్రమే.. నాకెక్కడా బ్రాంచీల్లేవ్’’ అని రచయిత లక్ష్మీ భూపాల ఫేస్బుక్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. మీ కోసం స్వార్థం కోసం పక్కోడి పేరు వాడుకోవడం కంటే అంగమార్పిడి చేయించుకోవడం మంచిది’ అని ఆయన మండిపడ్డారు. అసలు విషయానికొస్తే.. సినిమా అవకాశాల కోసం తన పేరు వాడుకుంటూ పబ్బం గడుపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తచేశారు. ‘‘నా దగ్గర అసిస్టెంట్ రచయితగా పనిచేశానని, నాకే తెలీకుండా నా దగ్గర ఘోస్ట్ దెయ్యం రైటర్‌గా పనిచేశానని ఈ మధ్య కొందరు మార్కెట్లో ఏ మాత్రం సిగ్గులేకుండా నా పేరు విచ్చలవిడిగా వాడేస్తున్నట్టు తెల్సింది. ఇది మొదటిసారి కాదు.. వాళ్ళని నిలువునా కోసి ఉప్పూకారం రాేస మంచితనం నా దగ్గరున్నా నన్నెవరూ నిజానిజాలు అడగలేదు కాబట్టి నేను కూడా చెప్పలేదు. ఇప్పుడు ఏకంగా నా అసిస్టెంట్ అని చెప్పుకుంటూ కొందరు కొన్నిచోట్ల అడ్వాన్స్ తీసుకున్నారని తెలిసింది.. వాడెలా రాస్తాడో చూడాలిగానీ, అలా చెప్తే ఎలా డబ్బులిచ్చారని నేను అడిగితే ‘మీ దగ్గర పనిచేస్తాడన్న నమ్మకం’ అన్నారు.. ఇది చాలా పెద్ద తిట్టు నాకు.. కాబట్టి ఇప్పుడు తప్పడం లేదు. నేను సినిమాల్లో మాటలు, పాటలు రాయడానికి ఇప్పటివరకు నా బుర్రని తప్ప ఇంకెవరి సహాయం తీసుకోలేదు, నాకు ఒక్క అసిస్టెంట్ కూడా లేడు. ఇకముందు కూడా ఆ అవసరం లేదు.. ఎందుకంటే నిర్మాత, దర్శకుడు నన్ను, నా బుర్రని నమ్మి డబ్బులిస్తారని నమ్ముతాను కాబట్టి.. అసిస్టెంట్లను పెట్టుకునే ఇతర రచయితల ఇబ్బందులు నాకు తెలీదు కాబట్టి వారి విషయంలో నేను మాట్లాడలేను’’ అని పేర్కొన్నారు. చందమామ, అలా మొదలైంది, నేనే రాజు నేనే మంత్రి, ఓ బేబీ లాంటి హిట్ సినిమాలకు లక్ష్మి భూపాల్ రచయితగా పని చేసారు. ప్రస్తుతం లూసిఫర్ రీమేక్, అన్నీ మంచి శకునములే సినిమాలకు రైటర్‌గా పని చేస్తున్నారు.