‘లాభం’ సెన్సార్ పూర్తి.. విడుదలకి సిద్దం

ABN , First Publish Date - 2021-09-07T19:03:10+05:30 IST

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన లేటెస్ట్ మూవీ 'లాభం'. తాజాగా ఈ మూవీకి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఎస్‌.పి.జననాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇందులో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటించింది.

‘లాభం’ సెన్సార్ పూర్తి.. విడుదలకి సిద్దం

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన లేటెస్ట్ మూవీ 'లాభం'. తాజాగా ఈ మూవీకి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఎస్‌.పి.జననాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇందులో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్‌ను పొందింది. ఈ నేపథ్యంలో వినాయకచవితి పండుగ సందర్భంగా సెప్టెంబర్ 9న 'లాభం' సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుద‌లకు సిద్దమవుతోంది. ఈ మూవీలో జగపతిబాబు, సాయి ధన్సిక, కలైయ రసన్, రమేష్ తిలక్, పృత్వి రాజన్, డేనియల్ అన్నే పోపే, నితీష్ వీర, జయ్ వర్మన్ ఇతర పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని లాయ‌ర్ శ్రీరామ్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ(వైజాగ్ సతీష్) తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. 

Updated Date - 2021-09-07T19:03:10+05:30 IST