ట్రాజడీ కింగ్ దిలీప్‌కుమార్ కన్నుమూసి 24 గంటలు అయ్యాయో లేదో బాలీవుడ్లో మరో ప్రముఖుడు కుమార్ రామ్సే కన్నుమూశారు. హారర్ చిత్రాల నిర్మాణంలో ఓ ట్రెండ్ సృష్టించిన రామ్ సే సోదరుల్లో కుమార్ పెద్దవారు. 85 ఏళ్ల వయసు కలిగిన ఆయన గుండెపోటుతో గురువారం మరణించారు. రామ్ సే సోదరులు నిర్మించిన ‘పురానా మందిర్’, ‘సాయా’. ‘ఖోజ్’ సహా ఎన్నో చిత్రాలకు కుమార్ రచన చేశారు. ‘ఖోజ్’ చిత్రంలో రిషీ కపూర్ హీరోగా నటించారు. కుమార్ తండ్రి ఫతేచంద్ యు రామ్సింఘానీ కూడా నిర్మాతే. ఏడుగురు అన్నదమ్ముల్లో కుమార్ పెద్దవారు. 1970-80 మధ్య కాలంలో తక్కువ బడ్జెట్లో వరుసగా హారర్ చిత్రాలు నిర్మిస్తూ రామ్ సే సోదరులు ఓ ట్రెండ్ సృష్టించారు.