నిర్మాతను అభినందించిన కె.ఎస్‌.

ABN , First Publish Date - 2022-01-27T05:38:02+05:30 IST

‘ఇది పేరుకు చిన్న చిత్రంగా అనిపించినా, నిర్మాత ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. కథ, కథనాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ తీశారని విన్నాను...

నిర్మాతను అభినందించిన కె.ఎస్‌.

‘ఇది పేరుకు చిన్న చిత్రంగా అనిపించినా, నిర్మాత ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. కథ, కథనాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ తీశారని విన్నాను. ఎంతో అభిరుచితో ఈ చిత్రాన్ని తీసిన నిర్మాతను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. ఇటువంటి చిత్రాలు మరిన్ని రావాలి’ అన్నారు ప్రముఖ నిర్మాత కె.ఎస్‌. రామారావు. విశ్వ కార్తికేయ హీరోగా నటించిన ‘అల్లంత దూరాన’ చిత్రంలోని ‘కొక్కొరొకో’ పాటను ఆయన ఆవిష్కరించారు. చలపతి పువ్వల దర్శకత్వంలో ఎన్‌.చంద్రమోహనరెడ్డి తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. నటి ఆమని మేనకోడలు హ్రితికా శ్రీనివాసన్‌ ఇందులో కథానాయికగా నటించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘నిర్మాత కె.ఎస్‌.రామారావుగారన్నా, ఆయన క్రియేటివ్‌ కమర్షియల్స్‌ సంస్థ అన్నా నాకు ఎంతో ఇష్టం. ఆ పేరు వచ్చేలా మా బ్యానర్‌కు పేరు పెట్టుకున్నాం. చిత్రం షూటింగ్‌ పూర్తయింది. త్వరలో విడుదల చేస్తాం’ అన్నారు.


ఫీల్‌ గుడ్‌ లవ్‌స్టోరీ ఇది, చాలా రిచ్‌గా సినిమా తీశామని’  దర్శకుడు చలపతి చెప్పారు. మంచి పాటలు రాసే అవకాశం తనకు లభించిందని గీత రచయిత రాంబాబు చెప్పారు. 


భాగ్యరాజా, అలీ, ఆమని, జేపీ, తులసి తదితరులు ఈ చిత్రంలో నటించారు.


Updated Date - 2022-01-27T05:38:02+05:30 IST