క్రితిసనన్ కథానాయికగా ఓ మరాఠీ చిత్రానికి రీమేక్‌గా రూపొందిన చిత్రం ‘మీమీ’. సరోగసీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి లక్ష్మన్ ఉటేకర్ దర్శకుడు. తాజాగా ఈ చిత్రం విడుదలకు సంబంధించి కథానాయిక క్రితిసనన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఈ నెలలోనే సినిమా విడుదల కాబోతుంది అని ఆనందం వ్యక్తం చేశారు. సరోగసీ మదర్ పాత్ర పోషించడం కోసం క్రితి 15 కిలోల బరువు పెరిగారు. మాతృత్వంలోని విభిన్న కోణాలు ఆవిష్కరించే చిత్రమిదని ఆమె పేర్కొన్నారు. మనోజ్ పహ్వా, పంకజ్ త్రిపాఠీ, సుప్రియా పాటక్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 13న ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.