Kriti Sanon : ఆమీర్ ఖాన్‌తో పోల్చి నన్ను ఇబ్బంది పెట్టకండి!

ABN , First Publish Date - 2021-12-04T21:25:28+05:30 IST

తెలుగులో మహేశ్ బాబుతో ‘వన్’ సినిమా చేసిన స్లిమ్ బ్యూటీ కృతీ సనోన్ ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉంది. క్రేజీ ప్రాజెక్ట్స్ సైన్ చేస్తోంది. రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ రోల్సే కాకుండా పర్ఫామెన్స్‌కి ఛాన్స్ ఉన్న సినిమాల్ని కూడా ఆమె ఒడిసి పట్టుకుంటోంది. అటువంటిదే ‘మిమి’ సినిమా. విభిన్నమైన కథాంశంతో రూపొందిన ఆ సినిమాలో కృతీదే టైటిల్ రోల్.

Kriti Sanon : ఆమీర్ ఖాన్‌తో పోల్చి నన్ను ఇబ్బంది పెట్టకండి!

తెలుగులో మహేశ్ బాబుతో ‘వన్’ సినిమా చేసిన స్లిమ్ బ్యూటీ కృతీ సనోన్ ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉంది. క్రేజీ ప్రాజెక్ట్స్ సైన్ చేస్తోంది. రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ రోల్సే కాకుండా పర్ఫామెన్స్‌కి ఛాన్స్ ఉన్న సినిమాల్ని కూడా ఆమె ఒడిసి పట్టుకుంటోంది. అటువంటిదే ‘మిమి’ సినిమా. విభిన్నమైన కథాంశంతో రూపొందిన ఆ సినిమాలో కృతీదే టైటిల్ రోల్. 


‘మిమి’ సినిమా కోసం బాగానే కష్టపడింది బక్కపల్చని భామ. సాధారణంగా చాలా స్లిమ్‌గా ఉండే సెక్సీ బ్యూటీ ఒకేసారి 15 కిలోలు పెరిగింది. పాత్ర డిమాండ్ మేరకు లావైపోయింది. అయితే, బీ-టౌన్‌లో ఇలాంటి పనులు రెగ్యులర్‌గా చేసేది ఎవరు? పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖానే! బరువు పెరగటం, తగ్గటం లాంటి ప్రయోగాలు ఆయన గతంలో చాలానే చేశాడు. అదే బాటలో ‘మిమి’ కోసం కృతీ సనోన్ కూడా రిస్క్ చేసింది. అందుకు తగ్గ ప్రశంసలు కూడా అందుకుంటోంది. ‘ఫీమేల్ ఆమీర్ ఖాన్’ అంటున్నారు మిస్ సనోన్‌ని! 


ఆమీర్ ఖాన్‌తో పోల్చటం ఎవరికైనా ఆనందంగానే ఉంటుంది. కానీ, మన లేడీ పర్ఫెక్షనిస్ట్ మాత్రం అటువంటి పని చేయొద్దని రిక్వెస్ట్ చేస్తోంది. తన మీద ఒత్తిడి పెరిగి ఇబ్బంది పడతానని అంటోంది. ఆమీర్‌తో పోలికకు ఇంకా చాలా టైముందని వినయంగా విన్నవిస్తోంది! చూడాలి మరి, సినిమా కోసం బరువు పెరిగిన కృతీ బాలీవుడ్‌లో తన వెయిట్ కూడా పెంచుకోగలుగుతుందో లేదో... 

Updated Date - 2021-12-04T21:25:28+05:30 IST