kriti sanon: ప్రభాస్‌తో టెన్షన్ ఉండదు..

ABN , First Publish Date - 2021-10-21T16:44:02+05:30 IST

ప్రభాస్‌తో నటిస్తున్నప్పుడు టెన్షన్ ఉండదు..అంటోంది బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్. ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమాలలో 'ఆదిపురుష్' ఒకటి. ఇది ఆయన నటిస్తున్న మొదటి స్ట్రైట్ హిందీ మూవీ కావడం విశేషం.

kriti sanon: ప్రభాస్‌తో టెన్షన్ ఉండదు..

ప్రభాస్‌తో నటిస్తున్నప్పుడు టెన్షన్ ఉండదు..అంటోంది బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్. ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమాలలో 'ఆదిపురుష్' ఒకటి. ఇది ఆయన నటిస్తున్న మొదటి స్ట్రైట్ హిందీ మూవీ కావడం విశేషం. మొదటిసారి ప్రభాస్ నటిస్తున్న ఈ పౌరాణిక చిత్రంలో ఆయన రాముడిగా కనిపించబోతుండగా, సీత్ర పాత్రలో కృతి సనన్, లంకేశ్ పాత్రలో సైఫ్ అలీఖాన్, లక్ష్మణ పాత్రలో సన్నీ సింగ్ కనిపిచబోతున్నారు. ఇటీవలే సైఫ్, కృతి సనన్ తమ పాత్రలకి సంబంధించిన షూటింగ్ పూర్తి చేశారు. ఈ క్రమంలో తాజాగా ఆమె ఇంచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కృతి సనన్ మాట్లాడుతూ.. 'స్క్రీన్ మీద మా జంట బాగా అందంగా కనపడుతుంది' అన్నారు. అంతేకాదు ప్రభాస్‌ షూటింగ్ మొదలైనప్పుడు సెట్‌లో కాస్త సిగ్గుపడుతూ కనిపించారు. కానీ, ఆ తర్వాత అలవాటుపడ్డారని..ప్రభాస్‌తో టెన్షన్ ఉండదు. ఆయనతో నటించడం చాలా హ్యాపీగా వుంది' అంటూ చెప్పుకొచ్చారు కృతీ. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇక ప్రభాస్ బ్నర్త్ డే అయిన అక్టోబర్ 23న ఆదిపురుష్ మూవీ నుంచి సర్‌ప్రైజ్ రానున్నట్టు సమాచారం.   

Updated Date - 2021-10-21T16:44:02+05:30 IST