body shaming : నడుము, నవ్వు, పెదాలు, ముక్కు... అన్నీ మార్చుకోమన్నారట!

Twitter IconWatsapp IconFacebook Icon
body shaming : నడుము, నవ్వు, పెదాలు, ముక్కు... అన్నీ మార్చుకోమన్నారట!

‘పరం సుందరీ’ పాటతో కుర్రాళ్ల మనసులు దోచేసింది ‘దోచెయ్’ బ్యూటీ కృతీ సనోన్. బాలీవుడ్‌లో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్న మన ‘వన్’ మూవీ ఫేమ్ నెక్ట్స్ ప్రభాస్ సరసన సీతా దేవిగా ‘ఆదిపురుష్’లో కనిపించనుంది. భారీ ప్రాజెక్ట్స్, క్రేజీ మూవీస్‌తో దూసుకుపోతోన్న కృతీ మొదట్లో తనకు ఎదురైన బాడీ షేమింగ్ కామెంట్స్‌ను తాజాగా గుర్తు చేసుకుంది. 


సన్నగా, మల్లెతీగలా ఉండే పొడుగు కాళ్ల సుందరి కృతీని... కొందరు... ‘‘నువ్వు నవ్వితే బావుండ’’వని అన్నారట! అంతే కాదు, ఆమె పెదాల ఆకృతి మార్చుకోమని సలహా ఇచ్చారట. మరికొందరైతే మిస్ సనోన్ ముక్కుని టార్గెట్ చేశారట. ఆమె నవ్వినప్పుడు నాసికా రంధ్రాలు ఎర్రబడతాయని ఎత్తి చూపారట! అలా జరగటం నిజమే అని ఒప్పుకున్న కృతీ... ‘‘నేనేం ప్లాస్టిక్ బొమ్మని కాదు కదా’’ అంటోంది. ఇక మరీ ఆశ్చర్యకరం ఏంటంటే తన నడుముని కూడా ఇంకాస్త తగ్గించమని చెప్పారట! ఫ్యాన్స్ అదృష్టం కొద్దీ కృతీ సనోన్ చెప్పుడు మాటలు ఏవీ వినలేదు. తనలా మాత్రమే తాను ఉంటూ వచ్చింది. అలాగే ఇప్పుడు కోట్లాది మందికి అభిమాన నాయిక అయింది. మిగతా వారికి కూడా ఆమె అదే చెబుతోంది. ఎవరెవరో వచ్చి ఏదేదో చెబితే అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని బందాస్ బాలీవుడ్ బ్యూటీ అంటోంది... 

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.