హ్యాట్రిక్ హిట్స్ కొట్టేసిన ‘ఉప్పెన’ బ్యూటీ

ABN , First Publish Date - 2022-01-18T16:50:39+05:30 IST

సాధారణంగా ఇండస్ట్రీలో ఒక హిట్ అందుకోవడమే గగనం. అలాంటిది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు వరుస విజయాలతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది కృతిశెట్టి. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలకు కృతి అదృష్ట లక్ష్మి. ఆమె నటిస్తో్న్న ప్రతీ సినిమా సూపర్ హిట్ సొంతం చేసుకోవడంతో ఆమె క్రేజ్ ను క్యాష్ చేసుకొనే ప్రయత్నంలో ఉన్నారు దర్శక, నిర్మాతలు. లాస్టియర్ మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ పరిచయ చిత్రం ‘ఉప్పెన’ తో మొదలైంది కృతిశెట్టి జైత్రయాత్ర. ఈ ఏడాది ‘శ్యామ్ సింగారాయ్, బంగార్రాజు’ చిత్రాలతో రెండు వరుస నెలల్లో ఘనవిజయాలు సొంతం చేసుకుంది.

హ్యాట్రిక్ హిట్స్  కొట్టేసిన ‘ఉప్పెన’ బ్యూటీ

సాధారణంగా ఇండస్ట్రీలో ఒక హిట్ అందుకోవడమే గగనం. అలాంటిది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు వరుస విజయాలతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది కృతిశెట్టి. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలకు కృతి అదృష్ట లక్ష్మి. ఆమె నటిస్తోన్న ప్రతీ సినిమా సూపర్ హిట్ సొంతం చేసుకుంటూండడంతో ఆమె క్రేజ్ ను క్యాష్ చేసుకొనే ప్రయత్నంలో ఉన్నారు దర్శక, నిర్మాతలు. లాస్టియర్ మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ పరిచయ చిత్రం ‘ఉప్పెన’ తో మొదలైంది కృతిశెట్టి  జైత్రయాత్ర. ఈ ఏడాది ‘శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు’ చిత్రాలతో రెండు వరుస నెలల్లో ఘనవిజయాలు సొంతం చేసుకుంది.


ప్రస్తుతం ఎనర్జిటిక్ స్టార్ రామ్ ‘ది వారియర్’ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా సుధీర్ బాబు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, నితిన్ మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లోనూ కథానాయికగా నటిస్తోంది. ఆకర్షించే అందం, ఆకట్టుకొనే అభినయం, నవ్వితే బుగ్గల్లో సొట్టలు పడి మరింత అందంగా ఎలివేట్ అయ్యే కృతిశెట్టి అంటే ఇప్పుడు యూత్ లో చెప్పలేని క్రేజ్. మరిన్ని హిట్స్ పడితే.. స్టార్ హీరోల సరసన జోడీ కట్టే అవకాశాలున్నాయి. మరి కృతి సక్సెస్ ఇంకా ఎన్ని సినిమాల వరకూ కొనసాగుతుందో చూడాలి. 

Updated Date - 2022-01-18T16:50:39+05:30 IST