పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్గా ‘భీమ్లానాయక్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. తదుపరిగా క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ చిత్రం బ్యాలెన్స్ షూట్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఆ తర్వాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్‌సింగ్’ చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ రెండూ కాక.. పవన్ మరో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలొస్తున్నాయి. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వినోదయ చిత్తం’ చిత్రం రీమేక్ లో నటిస్తున్నారని టాక్స్ వినిపిస్తున్నాయి. సముద్రఖని దర్శకత్వంలో ఆయన ప్రధాన పాత్రలో, తంబిరామయ్య కీలక పాత్రలో రూపొందిన ఈ సినిమాకి మంచి పేరొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను పవర్ స్టార్ తో రీమేక్ చేయబోతున్నారట. అలాగే తంబి రామయ్య పాత్రను తెలుగులో సాయిధరమ్ తేజ్ చేస్తున్నారని వినికిడి. ఒక విధంగా ఇది మల్టీస్టారర్ గా చెప్పుకోవాలి.
సాయిధరమ్ తేజ్ జోడీగా ‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టిని ఎంపిక చేస్తున్నారట. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ త్వరలోనే రాబోతోంది. పవన్ కళ్యాణ్ టీమ్ వర్క్స్, జీ స్డూడియోస్ సంయుక్త నిర్మాణంలో సినిమా తెరకెక్కనుందని సమాచారం. పవన్ తన రెమ్యూనరేషన్ కు బదులుగా ఈ సినిమాలో వాటా తీసుకోబోతున్నారట. సాధారణంగా పవన్ ఒకో సినిమాకి రూ. 50 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటారు. దాన్నే ఈ సినిమాకి పెట్టుబడిగా పెట్టారని టాక్స్ వినిపిస్తున్నాయి. ‘ఉప్పెన’ తో తమ్ముడు వైష్ణవ్ తేజ్ తో నటించి మెప్పించిన కృతి శెట్టి.. ఇప్పుడు అన్న సాయిధరమ్ తేజ్ సరసన నటించబోతుండడం విశేషంగా మారింది. మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.