‘ఉప్పెన’ చిత్రంతో టాలీవుడ్ ను తన అందాలతో ముంచెత్తింది కృతి శెట్టి. తొలి చిత్రమే బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆమెకి తదుపరి చిత్రాల్లో ఆఫర్స్ ఆటోమెటిగ్గా వచ్చి పడ్డాయి. దీని తర్వాత ఆమె నటించిన ‘శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు’ చిత్రాలు సైతం సూపర్ సక్సెస్ అవడంతో హ్యాట్రిక్ హీరోయిన్ గా అరుదైన ఘనత దక్కించుకుంది. ప్రస్తుతం కృతి శెట్టి కథానాయికగా సుధీర్ బాబు ‘ఆ అమ్మాయిగురించి మీకు చెప్పాలి’, రామ్ పోతినేని ‘ది వారియర్’, నితిన్ ‘మాచర్ల నియోజక వర్గం’ చిత్రాల్లో నటిస్తోంది. ఇక వీటితో పాటు ఆమె తమిళ ఎంట్రీ కూడా ఖాయమైంది. సూర్య హీరోగా బాల దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్నట్టు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. బాల, సూర్య కలయికలో ఇంతకు ముందు వచ్చిన ‘నంద, పితామగన్’ చిత్రాలు సూపర్ హిట్టయ్యాయి. అయినప్పటికీ మళ్ళీ ఈ కాంబో రిపీట్ అవడానికి దాదాపు 19 ఏళ్ళు పట్టింది.
2డి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్య, జ్యోతిక సొంతంగా నిర్మిస్తున్న ఈ సినిమాను అఫీషియల్ గా ప్రకటించారు. ఈరోజు (సోమవారం) కృతి శెట్టిని కథానాయికగా ఎంపిక చేసినట్టు ప్రకటిస్తూ .. ఒక ప్రత్యేక పోస్టర్ ను కూడా షేర్ చేశారు. అందులో షూటింగ్ బిగిన్ అయినట్టు మెన్షన్ చేశారు. ఇదే సినిమాను తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు, అందులో ఒక పాత్ర మూగ, బధిర బాధితుడని గతంలో వార్తలొచ్చాయి. అలాగే. ఆ పాత్రకి జోడీగా జ్యోతిక నటిస్తున్నట్టు కూడా టాక్ వినిపించింది. ఇప్పుడు మరో హీరోయిన్ గా కృతి శెట్టి ఖాయమైంది. మరి కృతి తొలి తమిళ ఎంట్రీ ఆమెకి ఏ స్థాయిలో పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.