'ఐకాన్‌'లో బన్నీ సరసన బేబమ్మ..?

ABN , First Publish Date - 2021-09-09T13:55:13+05:30 IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'ఐకాన్' అనే సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆయన సరన 'ఉప్పెన' సినిమాలో బేబమ్మగా ఆకట్టుకున్న కృతి శెట్టి నటించనుందనే వార్త ఒకటి ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.

'ఐకాన్‌'లో బన్నీ సరసన బేబమ్మ..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'ఐకాన్' అనే సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆయన సరన 'ఉప్పెన' సినిమాలో బేబమ్మగా ఆకట్టుకున్న కృతి శెట్టి నటించనుందనే వార్త ఒకటి ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. 'వకీల్ సాబ్' తర్వాత దర్శకుడు వేణు శ్రీరామ్, 'ఐకాన్' స్క్రిప్ట్‌ను పాన్ ఇండియన్ మూవీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేస్తున్నాడట. 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియన్ స్టార్‌గా మారిన బన్నీ ఆ తర్వాత ప్రాజెక్ట్స్ కూడా అదే స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. 


ఈ క్రమంలోనే 'ఐకాన్' పాన్ ఇండియన్ సినిమాగా దిల్ రాజు నిర్మించబోతున్నాడట. ఇందులో ఓ హీరోయిన్‌గా పూజా హెగ్డేని పరిశీలిస్తున్న చిత్రబృందం సెకండ్ హీరోయిన్‌గా కృతి శెట్టిని తీసుకునే ఆలోచనలో ఉందట. ఇదే గనక నిజమైతే అమ్మడి ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా 'ఐకాన్' అవుతుంది. ప్రస్తుతం కృతి నానితో 'శ్యామ్ సింగ రాయ్', రామ్ తో ఓ సినిమా, సుధీర్ బాబుతో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాలలో నటిస్తోంది. వీటితో పాటు నితిన్ సరసన కూడా ఓ మూవీ కమిటైనట్టు సమాచారం.


Updated Date - 2021-09-09T13:55:13+05:30 IST