నితిన్ సరసన కృతి శెట్టి ..?

ABN , First Publish Date - 2021-07-08T19:08:54+05:30 IST

యూత్ స్టార్ నితిన్ సరన 'ఉప్పెన' ఫేం కృతి శెట్టి నటించబోతుందా.. అవుననే మాట ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోందట. ప్రస్తుతం నితిన్ బాలీవుడ్ హిట్ మూవీ 'అంధాదున్' తెలుగు రీమేక్ 'మాస్ట్రో'లో నటుస్తున్నాడు. నభా నటేశ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఇందులో తమన్నా కీలక పాత్రలో కనిపించబోతోంది.

నితిన్ సరసన కృతి శెట్టి ..?

యూత్ స్టార్ నితిన్ సరసన 'ఉప్పెన' ఫేం కృతి శెట్టి నటించబోతుందా.. అవుననే మాట ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోందట. ప్రస్తుతం నితిన్ బాలీవుడ్ హిట్ మూవీ 'అంధాదున్' తెలుగు రీమేక్ 'మాస్ట్రో'లో నటిస్తున్నాడు. నభా నటేశ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఇందులో తమన్నా కీలక పాత్రలో కనిపించబోతోంది. ఇటీవలే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. దీంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్‌ను లైనప్ చేసుకుంటున్నాడు నితిన్. ఈ క్రమంలో ప్రముఖ ఎడిటర్ ఎస్ఆర్ శేఖర్‌కి దర్శకుడిగా అవకాశం ఇస్తూ ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందులో హీరోయిన్‌గా కృతి శెట్టిని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న కృతి శెట్టికి ఇది మరో మంచి అవకాశం అనే టాక్ వినిపిస్తోంది. మరి మేకర్స్ ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడు ఇవ్వనున్నారో చూడాలి. 

Updated Date - 2021-07-08T19:08:54+05:30 IST