యంగ్ హీరో నాగశౌర్య.. గత చిత్రాలు ‘వరుడు కావలెను, లక్ష్య’ చిత్రాలు ఆశించిన రీతిలో అలరించలేకపోయాయి. తాజాగా అతడు నటిస్తున్న ప్రేమకథా చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకుంటోంది. షెర్లిన్ సితియా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 22న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. కామెడీ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ఇంప్రెసివ్ గా, ప్రామిసింగ్ గా ఉంది.
‘కనిపించి వినిపించకుండా.. వినిపించి కనిపించకుండా.. గంట ఇక్కడి నుంచి వస్తోంది. మీకూ వినిపిస్తోందా? అని నాగశౌర్య ఒక అమ్మాయిని ఉద్దేశిస్తూ అనడం.. గంట చప్పుడైందే.. దగ్గరలో గుడికూడా లేదు. అంటూ నాగశౌర్య ని అతడి ఫ్రెండ్స్ సత్య, రాహుల్ రామ్ కృష్ణ ఆటపట్టించడం.. నాగశౌర్య ఒక అందమైన అమ్మాయి వెంట పడడం.. ఆమె అతడ్ని పట్టించుకోకపోవడం.. ఆ తర్వాత ఆ అమ్మాయికి విసుగొచ్చి.. ‘ప్లీజ్ ట్రై టూ అండర్ స్టాండ్.. యూఆర్ రన్నింగ్ బిహైండ్ ద రాంగ్ గాళ్’.. అంటూ అతడ్ని తప్పించుకు తిరగడం.. ఈ అమ్మాయిలేంట్రా? అసలు అర్దం కారు అని నాగశౌర్య అసహనం వ్యక్తం చేయడం.. టీజర్ లో చూడొచ్చు.. ‘పెళ్ళి చేసుకుందాం సినిమాలో సౌందర్యలా సెక్యువల్ అబ్యూజ్ అయినా పర్వాలేదు. వెంకటేశ్ కన్నా నిన్ను బాగా చూసుకుంటాను నేను’. అని శౌర్య ఆ అమ్మాయితో చెప్పే డైలాగ్ ఈ టీజర్ కి కొసమెరుపు. విజువల్స్ లో రొమాన్స్ మోతాదు కూడా కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. మొత్తానికి నాగశౌర్య నుంచి ఓ డిఫరెంట్ లవ్ స్టోరీ రాబోతోందని టీజర్ ను బట్టి అర్ధమవుతోంది.