‘క్రిష్4’ నేపథ్యం అదేనా?

బాలీవుడ్ క‌థానాయ‌కుడు హృతిక్ రోష‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘క్రిష్’ 2006లో విడుద‌లై భారీ విజ‌యాన్ని సాధించింది. అంత‌కు ముందు హృతిక్ న‌టించిన ‘కోయి మిల్ గ‌యా’ సినిమాకు ఇది సీక్వెల్‌. ఈ రెండు చిత్రాలు సూప‌ర్ డూప‌ర్ హిట్స్ అయ్యాయి. త‌ర్వాత 2013లో ‘క్రిష్ 3’ రూపొందింది. ఈ సినిమా కూడా మంచి విజ‌యాన్నే ద‌క్కించుకుంది. దాదాపు ఎనిమిదేళ్ల త‌ర్వాత క్రిష్ సిరీస్‌లో నాలుగో భాగంగా ‘క్రిష్4’ రూపొంద‌నుంది. హృతిక్ తండ్రి రాకేశ్ రోష‌న్ రూపొందించ‌నున్న ఈ చిత్రానికి సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యొక‌టి తెలిసింది. అదేంటంటే.. కోయిమిల్‌గ‌యా, క్రిష్ రెండింటిని మిక్స్ చేసే టైమ్ ట్రావెల్ నేప‌థ్యంలో ‘క్రిష్ 4’ తెర‌కెక్క‌నుంద‌ట‌. మ‌రి ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న ఎప్పుడు వెలువ‌డ‌నుందో చూడాలి. 

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.