‘రామారావు’ లో ‘క్రాక్’ ఫార్ములా ?

ABN , First Publish Date - 2021-09-24T18:02:47+05:30 IST

‘రాజా ది గ్రేట్’ మూవీ తర్వాత మాస్ మహారాజా రవితేజ నటించిన పలు చిత్రాలు పరాజయం పాలయ్యాయి. దాంతో ఆయన కెరీర్ డైలమాలో పడింది. అయితే దర్శకుడు గోపీచంద్ మలినేని రవితేజకి ఈ ఏడాది సంక్రాంతికి ‘క్రాక్’ రూపంలో బ్లాక్ బస్టర్ హిట్టవ్వడంతో .. రవితేజ మళ్ళీ ఫామ్ లోకి వచ్చేశారు.

‘రామారావు’ లో ‘క్రాక్’ ఫార్ములా ?

‘రాజా ది గ్రేట్’ మూవీ తర్వాత మాస్ మహారాజా రవితేజ నటించిన పలు చిత్రాలు పరాజయం పాలయ్యాయి. దాంతో ఆయన కెరీర్ డైలమాలో పడింది. అయితే దర్శకుడు గోపీచంద్ మలినేని రవితేజకి ఈ ఏడాది సంక్రాంతికి  ‘క్రాక్’ రూపంలో బ్లాక్ బస్టర్ హిట్టవ్వడంతో .. రవితేజ మళ్ళీ ఫామ్ లోకి వచ్చేశారు. ప్రస్తుతం ఆయన రెండు సినిమాల్ని ఎటే టైమ్ పట్టాలెక్కించారు. రమేశ్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా..  శరత్ మండవ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీ  ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా కోసం  రవితేజ  తనకి సూపర్ హిట్టిచ్చిన ‘క్రాక్’ మూవీ ఫార్ములానే అప్లై చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. 


క్రాక్ మూవీలో రవితేజ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటించిన సంగతి తెలిసిందే. అయితే అందులో అతడికి భార్య, ఒక కొడుకు ఉంటారు. శ్రుతి హాసన్, గోపీచంద్ మలినేని కొడుకు నటించిన.. ఈ రెండు పాత్రలకి కూడా సినిమాలో మంచి ప్రధాన్యం ఇచ్చారు దర్శకుడు గోపీచంద్. సరిగ్గా ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీలో కూడా రవితేజకి భార్య, ఒక కొడుకు ఉంటారట. ఇందులో ఓ పవర్ ఫుల్ యం.ఆర్.వో గా రవితేజ నటిస్తుండగా... ఆయన భార్యగా దివ్యాంషా కౌశిక్ నటిస్తోంది. సిన్సియర్ గా తన డ్యూటీ తాను చేసుకుపోయే రామారావు అనే ఓ ఎం.ఆర్.వో ప్రత్యర్ధుల్ని ఎలా ఒణికించాడు అన్నదే ఈ సినిమా కథాంశం. మరి ఈ సినిమాపై క్రాక్ ఫార్ములా ఎలా పనిచేస్తుందో చూడాలి. 

Updated Date - 2021-09-24T18:02:47+05:30 IST