కొత్త నానిని చూస్తారు!
ABN , First Publish Date - 2021-11-19T10:07:54+05:30 IST
‘‘మంచి టీమ్ దొరికినప్పుడు ఎలాంటి సినిమా వస్తుందో చెప్పడానికి ‘శ్యామ్ సింగరాయ్’ ఓ చక్కటి ఉదాహరణ’’ అన్నారు నాని. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’...

‘‘మంచి టీమ్ దొరికినప్పుడు ఎలాంటి సినిమా వస్తుందో చెప్పడానికి ‘శ్యామ్ సింగరాయ్’ ఓ చక్కటి ఉదాహరణ’’ అన్నారు నాని. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. సాయి పల్లవి, కృతి శెట్టి కథానాయికలు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. వెంకట్ బోయినపల్లి నిర్మాత. ఈనెల 24న విడుదల కాబోతోంది. గురువారం హైదరాబాద్లో టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ‘క్రిస్మస్ నాకు చాలా స్పెషల్. ఒకసారి ‘ఎంసీఏ’ వచ్చింది. ఈ క్రిస్మస్ కూడా మనదే. ‘శ్యామ్..’ ఓ ఎపిక్ లవ్ స్టోరీ. ఎక్కువగా అర్థం కాకూడదనే టీజర్ అలా కట్ చేశాం. టీజర్ కంటే సినిమా వందరెట్లు బాగుంటుంది. ఇక నుంచి ప్రతీ సినిమాలోనూ ఇది వరకు చూడని నానిని చూస్తార’’న్నారు. ‘‘టీజర్లో వంద సెకన్లు మాత్రమే చూశారు. థియేటర్లో వందరెట్లు ఎక్కువగా ఉంటుంద’’న్నారు దర్శకుడు.