దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) అనగానే మిర్చి (Mirchi), శ్రీమంతుడు (Srimanthudu), జనతా గ్యారేజ్ (Janatha Garage), భరత్ అనే నేను (Bharat Ane Nenu) లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు గుర్తొస్తాయి. అలాగే, ఇటీవల వచ్చిన ఆచార్య (Acharya) సినిమా కూడా గుర్తొస్తుంది. చెప్పాలంటే కొరటాల ఖాతలో చేరిన మొట్టమొదటి ఫ్లాప్ సినిమా ఇది. నిజంగా ఏ ఒక్కరు కొరటాల శివ నుంచి ఇటువంటి డిజాస్టర్ మూవీ వస్తుందని ఊహించరు. అందుకే, అర్జెంటుగా ఆయనకు ఓ భారీ హిట్ కావాలి. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ 30 (NTR 30) చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకురాబోతున్నారు. తాజాగా ఈ మూవీకి సబంధించిన అప్‌డేట్ కూడా వచ్చేసింది. ఎన్టీఆర్ (NTR) బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్ 30 నుంచి పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో మోషన్ పోస్టర్‌ను వదిలారు.
అయితే, ఎన్టీఆర్ 30 మోషన్ పోస్టర్ చూసిన ప్రతి ఒక్కరికి ఒక పోస్టర్ గుర్తొచి ఉంటుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అదేదో కాదు, అల్లు అర్జున్ (Allu Arjun) సినిమాదే కావడం విశేషం. కొరటాల శివ తన నెక్ట్స్ ప్రాజెక్టుని బన్నీతో చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఒక పోస్టర్ కూడా బయటకి వచ్చింది. సముద్రం, పడవలతో డిసైన్ చేసిన ఆ పోస్టర్ బన్నీ అభిమానులతో పాటు అందరిలోనూ ఆసక్తిని రేపింది. సేమ్ ఇప్పుడు కొరటాల, ఎన్టీఆర్ కలయికలో వస్తున్న సినిమా ఎన్టీఆర్ 30 మోషన్ పోస్టర్‌లోనూ దాదాపు బన్నీ పోస్టర్‌లో ఉన్న ఎలిమెంట్సే ఉన్నాయి.
అంటే, కొరటాల ఒకే బ్యాక్ డ్రాప్ ఉన్న స్టోరీని ఇద్దరు హీరోల కోసం రాశారా లేక... అచార్య రిజల్ట్ తర్వాత తప్పని సరై హిట్ కొట్టాల్సిందే కాబట్టి అల్లు అర్జున్ కథతోనే ఎన్టీఆర్ 30 సినిమా చేస్తున్నారా? అనేది తెలియాలి అంటే స్వయంగా కొరటాల శివనే క్లారిటి ఇవ్వాలి. ఇక ఈ టాక్ గురించి పక్కన పెడితే, ఆర్ఆర్ఆర్ (RRR) తర్వాత తారక్‌కు ఎలాంటి భారీ యాక్షన్ సినిమా పడాలో అటువంటిదే కొరటాల తెరకెక్కించనున్న ఎన్టీఆర్ 30 అని నందమూరి అభిమానులు చెప్పుకుంటున్నారు.