Acharya : చిరుతల షాట్‌పై కొరటాల ఆసక్తికర వివరణ

ABN , First Publish Date - 2021-11-30T20:58:45+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఆచార్య’. కొణిదెల ప్రొడక్షన్ హౌస్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను థియేటర్స్ లో విడుదల చేస్తు్న్నారు. ఇంతకు ముందు విడుదలైన టీజర్, రెండు సింగిల్స్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే.. ఇటీవల విడుదలైన రామ్ చరణ్ సిద్ధ పాత్రకు సంబంధించిన టీజర్ కూడా యూ ట్యూబ్ లో రికార్డు వ్యూస్ తెచ్చుకుంది.

Acharya : చిరుతల షాట్‌పై కొరటాల ఆసక్తికర వివరణ

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఆచార్య’. కొణిదెల ప్రొడక్షన్ హౌస్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను థియేటర్స్ లో విడుదల చేస్తు్న్నారు. ఇంతకు ముందు విడుదలైన టీజర్, రెండు సింగిల్స్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే.. ఇటీవల విడుదలైన రామ్ చరణ్ సిద్ధ పాత్రకు సంబంధించిన టీజర్ కూడా యూ ట్యూబ్ లో రికార్డు వ్యూస్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ టీజర్ లోని చివరి షాట్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఏటి ఒడ్డున చిరుత పిల్ల నీరు తాగుతూ ఉంటే.. దాని వెనుక తల్లి చిరుత కాపాలా కాస్తూండగా.. ఒడ్డుకు మరో వైపున రామ్ చరణ్ నీళ్ళు తాగుతుండగా.. చిరంజీవి వెనుక కాపాలా కాసే ఈ షాట్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే దీనిపై ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు కొరటాల ఆసక్తికరమైన వివరణ ఇచ్చారు. 


సిద్ధ టీజరే కాకుండా ‘ఆచార్య’లో రామ్ చరణ్ కు సంబంధించి ఒక ఫ్లో లో ఆర్గానిక్ గా సన్నివేశాలు వెళతాయని, అలాంటి సీన్స్ లో ఇదీ ఒకటని కొరటాల తెలిపారు. అంతేకాకుండా ఈ సీన్ తీసేటప్పుడు దీనికి చాలా మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకున్నాం. అయితే టీజర్ విడుదలయ్యాకా మేం అనుకున్నదానికన్నా చాలా ఎక్కువ స్పందన లభించిందని కొరటాల తెలిపారు. అలాగే ఈ షాట్ ఒక్క చిరు, చెర్రీలకు మాత్రమే సెట్టయ్యేదని కొరటాల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 

Updated Date - 2021-11-30T20:58:45+05:30 IST