అభిమానిగా ఫీలై ఆ సీన్‌ తీశా: కొరటాల శివ

ABN , First Publish Date - 2021-12-02T18:19:31+05:30 IST

‘ఆచార్య’ సినిమాకు సంబంధించిన ఒక్కో సర్‌ప్రైజ్‌ వదులుతూ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు కొరటాల శివ. చిరంజీవి లుక్‌ టీజర్‌, ‘లాహే లాహే’, నీలంబరి’ పాటలు సినిమా క్రేజ్‌ను పెంచాయి. తాజాగా విడుదల చేసిన ‘సిద్ధ సాగా’ అయితే క్రేజ్‌ను రెట్టింపు చేసి, అభిమానుల్లో ఎనర్జీ పెంచింది. ఇప్పుడంతా ‘సిద్ద టీజర్‌ గురించే మాట్లాడుకుంటున్నారు.

అభిమానిగా ఫీలై ఆ సీన్‌ తీశా: కొరటాల శివ

ధర్మం చుట్టూ తిరిగే కథ..

మరెన్నో సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి...

సవాల్‌ మాత్రమే కాదు.. ఒత్తిడి కూడా..

– కొరటాల శివ


‘ఆచార్య’ సినిమాకు సంబంధించిన ఒక్కో సర్‌ప్రైజ్‌ వదులుతూ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు కొరటాల శివ. చిరంజీవి లుక్‌ టీజర్‌, ‘లాహే లాహే’, నీలంబరి’ పాటలు సినిమా క్రేజ్‌ను పెంచాయి. తాజాగా విడుదల చేసిన ‘సిద్ధ సాగా’ అయితే క్రేజ్‌ను రెట్టింపు చేసి, అభిమానుల్లో ఎనర్జీ పెంచింది. ఇప్పుడంతా ‘సిద్ద టీజర్‌ గురించే మాట్లాడుకుంటున్నారు.  అందులో సెలయేటి పక్కన చిరుత, చిరుత పిల్ల ఓ పక్క, మరో పక్క చిరంజీవి, తనయుడు చరణ్‌ను ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఆ సన్నివేశం కనులవిందుగా ఉందంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇలాంటి సర్‌ప్రైజ్‌ ఇంకా ఇస్తానంటున్నారు దర్శకుడు కొరటాల శివ. ‘‘రెండు పెద్ద సర్‌ప్రైజ్‌లు త్వరలోనే వస్తాయి. ఇంకా తేది అనుకోలేదు. చిరంజీవి, రామ్‌ చరణ్‌ కలిసి డ్యాన్స్‌ చేసిన ఓ పాట ట్రైలర్‌ను విడుదల చేస్తాం. వీరిద్దరూ కలిసి ఇప్పటి వరకూ పూర్తిస్థాయిలో ఓ పాటకు డాన్స్‌ చేయలేదు. అది చూేస్త అభిమానులకు పండగే’’ అంటున్నారు శివ. ఇంకా సినిమా గురించి         ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 


‘‘ధర్మం చుట్టూ తిరిగే కథ ఇది. ధర్మానికి ప్రతిరూపం సిద్ధ పాత్ర. అలాంటి పాత్రను జనాల్లోకి తీసుకెళ్లాలంటే ఒక శాంతి శ్లోకం పెడితే బావుంటుందనిపించి ఆ విషయాన్ని మణిశర్మగారి ముందుంచా. ‘చాలా బాగుంటుంది. అలాగే మొదలుపెట్టు’ అన్నారు. సిద్ధ పాత్ర పరిచయం అభిమానులకు పండగలా ఉండాలని విజువల్‌ ట్రీట్‌ కోసం చివరి షాట్‌లో చిరంజీవి, రామ్‌ చరణ్‌ని ఓ వైపు, రెండు చిరుతల్ని మరోవైపు చూపించాం. సినిమాలో రోమాలు నిక్కబోడిచే సన్నివేశమది. ఆ సీన్‌ వాళ్లిదరికీ కరెక్ట్‌గా సరిపోయింది. ఆ సన్నివేశం చిత్రీకరణ సమయంలో ఓ దర్శకుడిలా కాకుండా అభిమానిలా ఫీలయ్యాను. అభిమానిగా చిరంజీవిగారిని తెరపై ఎలా చూడాలనుకున్నానో అలా చూపించే ప్రయత్నం చేశా. ఇది అభిమానులకే కాదు మూవీ లవర్స్‌ అందరికీ నచ్చుతుంది. రామ్‌చరణ్‌ ఈ సినిమాకు బోనస్‌. కథ రాసినప్పుడు నాకేమీ అనిపించలేదు. కానీ చిరంజీవిగారు, చరణ్‌ ఈ కథను అంగీకరించాక కొంచెం టెన్షన్‌ పడ్డా. వారిద్దరూ తొలిసారి కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో ఇద్దరి పాత్రలకు న్యాయం చేయాలి. మనం బాగా చూపించాలి’ అని తపన పడేవాడిని. ఓ రకంగా నాకు సవాల్‌ మాత్రమే కాదు.. ఒత్తిడిగా కూడా అనిపించేది. నా భయాన్ని గమనించిన చిరంజీవి చాలా సపోర్ట్‌ చేశారు’’ అని కొరటాల శివ అన్నారు. 



Updated Date - 2021-12-02T18:19:31+05:30 IST