ఓటీటీలోకి వచ్చేసిన ‘కొండపొలం’

ABN , First Publish Date - 2021-12-08T19:45:32+05:30 IST

మెగామేనల్లుడు వైష్ణవ్ తేజ్ రెండో చిత్రంగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొండపొలం’. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించిన ఈ సినిమా అడవుల నేపథ్యంలో సాగే గ్రామీణ చిత్రం. నున్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి రచించిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దసరా కానుకగా అక్టోబర్ 8న విడుదలైన ఈ మూవీ ఆశించిన రీతిలో అలరించలేకపోయింది.

ఓటీటీలోకి వచ్చేసిన ‘కొండపొలం’

మెగామేనల్లుడు వైష్ణవ్ తేజ్ రెండో చిత్రంగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొండపొలం’. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించిన ఈ సినిమా అడవుల నేపథ్యంలో సాగే గ్రామీణ చిత్రం. నున్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి రచించిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దసరా కానుకగా అక్టోబర్ 8న థియేటర్స్‌లో విడుదలైంది ఈ మూవీ.  ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సాయిబాబు జగర్లమూడి, రాజీవ్ రెడ్డి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. 


తాజాగా ‘కొండపొలం’ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాకి ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అవుతున్నారు. అడవుల చుట్టుపక్కల గ్రామాల్లో వర్షాభావం చేత గొర్రెలకు తినడానికి మేత, తాగటానికి నీరు లేనప్పుడు, వర్షాలు పడేవరకు తమ గొర్రెలని బతికించుకోవటం కోసం గొర్రెలకాపరులు అడవిబాట పడతారు. మళ్లీ తమ ఊరిలో వానలు పడి గొర్రెలకు నీరు, మేత దొరికే వరకు అడవుల చుట్టూ సంచరిస్తుంటారు. ఇలా చేసే వనవాసాన్ని స్థానికులు ‘కొండపొలం’ వెళ్లటం అని వ్యవహరిస్తారు. సాయిచంద్, కోట శ్రీనివాసరావు తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా కథాంశానికి ఓటీటీలోనైనా ఆదరణ దక్కుతుందేమో చూద్దాం. 

Updated Date - 2021-12-08T19:45:32+05:30 IST