konda trailer : నిప్పుల‘కొండా’మురళి

ABN , First Publish Date - 2022-01-26T16:47:39+05:30 IST

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ ‘కొండా’. వరంగల్ జిల్లా రాజకీయాల్ని ఒంటిచేత్తో నడిపించిన మురళీధర్, సురేఖ దంపతులు దశాబ్దకాలం పాటు తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించారు. వారి రాజకీయ ప్రయాణంలో ఎన్నో విజయాలు, అపజయాలు ఉన్నాయి. వాటి వెనుక ఎన్నో భావేద్వేగాలున్నాయి. ఎవరికీ తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిని రామ్ గోపాల్ వర్మ వెండితెరమీద ఆవిష్కరించే ప్రయత్నమే ‘కొండా’ చిత్రం. ఈ సినిమా షూటింగ్ ను అక్టోబర్ 12న కొండా మురళి స్వగ్రామమైన వంచనగిరిలో ప్రారంభమైంది.

konda trailer : నిప్పుల‘కొండా’మురళి

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ ‘కొండా’. వరంగల్ జిల్లా రాజకీయాల్ని ఒంటిచేత్తో నడిపించిన మురళీధర్, సురేఖ దంపతులు దశాబ్దకాలం పాటు తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించారు. వారి రాజకీయ ప్రయాణంలో ఎన్నో విజయాలు, అపజయాలు ఉన్నాయి. వాటి వెనుక ఎన్నో భావేద్వేగాలున్నాయి. ఎవరికీ తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిని రామ్ గోపాల్ వర్మ  వెండితెరమీద ఆవిష్కరించే ప్రయత్నమే ‘కొండా’ చిత్రం. ఈ సినిమా షూటింగ్ ను అక్టోబర్ 12న కొండా మురళి స్వగ్రామమైన వంచనగిరిలో ప్రారంభమైంది. షూటింగ్ ముగించుకొని విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ను రిపబ్లిక్ డే సందర్భంగా ఈరోజు (బుధవారం) ఉదయం 10 గంటల 25 నిమిషాలకు విడుదల చేశారు. కొండా మురళిగా త్రిగుణ్ (అదిత్ అరుణ్) నటించగా, ఆయన భార్య సురేఖగా ఇర్రామోర్ నటించారు. 


‘సమాజం గురించి నీతులు జెప్పుడు గాదు. బాగుచేయాలి. నీకు పోయేటందుకు ఏం లేవు. బానిస సంకెళ్ళు తప్ప. విప్లవ పోరాటాలు చరిత్రను లాగే రైల్ ఇంజెన్లు. పెద్దందార్ల పెత్తనం భరించలేక, కొంతమంది బడుగువర్గాలు తిరగబడి మొత్తం వ్యవస్థతోనే పోరాడుతున్న రోజులవి. విపరీత పరిస్థితుల నుంచే విపరీత వ్యక్తులు ఉద్భవిస్తారని, కార్ల్ మార్క్స్ 180 సంవత్సరాల క్రితం చెప్పాడు. అలాంటి విపరీత పరిస్థితుల మధ్యలో పుట్టిన వాడే కొండా మురళి’ అంటూ కొన్ని విజువ్సల్ పై వర్మ వాయిస్ వస్తుంది. త్రిగుణ్ (అదిత్ అరుణ్) సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. యల్బీ శ్రీరామ్, జబర్దస్త్ రామ్ ప్రసాద్, పృధ్వి, తులసి ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ‘కథ, 24 కిసెస్’ లాంటి సినిమాలతో మెప్పించిన త్రిగుణ్ ఈ సినిమాతో ఏ స్థాయిలో పేరు తెచ్చుకుంటాడో చూడాలి. 



Updated Date - 2022-01-26T16:47:39+05:30 IST