బాడీలో 47 బుల్లెట్లు దిగినా బతికింది ఎవరి కోసమో తెలుసా?

ABN , First Publish Date - 2022-01-26T23:30:42+05:30 IST

కొండా మురళి, సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘కొండా’. రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకుడు. కొండా మురళి పాత్రలో త్రిగుణ్‌, సురేఖ పాత్రలో ఇర్రా మోర్‌ నటించారు. శ్రేష్ఠ పటేల్‌ మూవీస్‌ సమర్పణలో ఆపిల్‌ ట్రీ, ఆర్జీవీ ప్రొడక్షన్‌ సంయుక్తంగా నిర్మించాయి. హనుమకొండలోని కొండా క్యాంపు ఆఫీసులో బుధవారం ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు.

బాడీలో 47 బుల్లెట్లు దిగినా బతికింది ఎవరి కోసమో తెలుసా?

కొండా మురళి, సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘కొండా’. రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకుడు. కొండా మురళి పాత్రలో త్రిగుణ్‌, సురేఖ పాత్రలో ఇర్రా మోర్‌ నటించారు. శ్రేష్ఠ పటేల్‌ మూవీస్‌ సమర్పణలో ఆపిల్‌ ట్రీ, ఆర్జీవీ ప్రొడక్షన్‌ సంయుక్తంగా నిర్మించాయి. హనుమకొండలోని కొండా క్యాంపు ఆఫీసులో బుధవారం ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు.  


ట్రైలర్‌లో కొండా మురళి కాలేజీ జీవితం నుంచి సురేఖతో ప్రేమలో పడటం, అన్న (మావోయిస్టు)లతో చేతులు కలపడం, రాజకీయాల్లో అడుగుపెట్టడం చూపించారు. ‘వాడిని సంపుడు నా పని కాదు, బాధ్యత’ అని ట్రైలర్‌ చివర్లో కొండా మురళి  పాత్రధారి చేత ఓ డైలాగ్‌ చెప్పించారు. అది ఎవర్నీ అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. సరిగ్గా 30 ఏళ్ల క్రితం జనవరి 26న, 10.25 గంటలకు కొండా మురళిని షూట్‌ చేసి చంపడానికి ట్రై చేశారని, అందుకని అదే సమయానికి ట్రైలర్‌ విడుదల  చేశామని వర్మ తెలిపారు. 


కొండా మురళి మాట్లాడుతూ ‘‘ఆర్జీవీకి రెండు ముక్కలు చెబితే... ఆయన వంద మంది దగ్గర ఎంక్త్వెరీ చేసి పూర్తి విషయాలు తెలుసుకుని సినిమా తీశారు. రెండు నెలల పదహారు రోజులు వరంగల్‌లో ఉండి షూటింగ్‌ చేశారు. ఇదే జనవరి 26న నా మీద 47 బుల్లెట్లు ఫైరింగ్‌ చేశారు. అయినా బతికాను. అది కూడా మా కుటుంబం కోసం కాదు, ప్రజల కోసం. ఈ సినిమా గురించి చెప్పడం కన్నా చూేస్త బావుంటుంది. త్రిగుణ్‌ బాగా నటించాడు. సురేఖ కంటే ఇర్రా మోర్‌ అందంగా ఉన్నారు’’ అని అన్నారు. 


కొండా సురేఖ మాట్లాడుతూ ‘‘ట్రైలర్‌ చూశాక మేం ఎంత బాధలు అనుభవించామనేది గుర్తొచ్చి భావోద్వేగానికి లోనయ్యా. ఆ ఫైరింగ్‌ ఘటనను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ రోజు జనవరి 26. నేను వెళ్లేసరికి మురళిగారు వైట్‌ లాల్చీ పైజామాలో రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఆయన చుట్టూ జనం నిలబడి ఉన్నారు. నా కూతురు ఎక్కడ ఉందో కనపడలేదు. నన్ను ఆయన దగ్గరకు వెళ్లనివ్వడం లేదు. మరణించాడని అన్నారు. ఆ రోజు ఆయన మరణించి ఉంటే... ఈ రోజు మేం ఎక్కడ ఉండేవాళ్లమో? మా కుటుంబం ఎక్కడ ఉండేదో? మా పరిస్థితి ఏంటో? ఆలోచించడానికి కూడా కష్టంగా ఉంది. దేవుడు నాకు ఇచ్చిన పసుపు కుంకుమ బలం కొండా మురళిగారు మన ముందు ఉండటం. మా పుట్టినరోజున,, పెళ్లి రోజు, పండగలకు ఆయన కాళ్లు మొక్కుతా. ఇటీవల తొలిసారి అడిగా.. ‘కాళ్లు మొక్కినప్పుడు ఏం అనుకుంటారు?’ అని. ‘నీ తాళిబొట్టు గట్టిది అనుకుంటాను’ అని చెప్పారు. ఆర్జీవీ గారి గురించి బయట విన్నదానికి, చూసిన దానికి అసలు సంబంధం లేదు. ఆయన గురించి బయట చెప్పేవన్నీ అబద్దాలు. ప్రపంచంలో ఆయనకు తెలియనిది ఏదీ లేదు. మేం పడ్డ కష్టాలకు రామాయణం, మహాభారతం కంటే ఎక్కువ’’ అని అన్నారు.   


రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ ‘‘కొండా దంపతులు విప్లవకారులు.. నేను వాళ్లలా కాదు. విప్లవకారుడు అయ్యేంత ధైర్యం నాకు లేదు. అందుకని, ఎవరైతే రిస్కులు తీసుకుని ఉంటారో? వాళ్ల దగ్గరకు వెళ్లి ‘కథ ఇస్తారా? సినిమా తీస్తా అని తీేసస్తా. ప్రత్యేక పరిస్థితుల్లో కొంత మంది వ్యక్తులు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల నుంచి వాళ్ల జీవితాలు రకరకాల మలుపులు తిరిగి. ఓ ప్రత్యేకత సంతరించుకుంటాయి. ఆ ప్రత్యేకత ఎంతోమంది మీద ప్రభావం చూపిస్తుంది. ఇదొక వయలెంట్‌ క్రేౖమ్‌ డ్రామా అయినా స్ట్రాంగ్‌ లవ్‌ స్టోరీ ఉంది. మురళీ జీవితం మీద ఐదారు సినిమాలు తీయవచ్చు. ‘కొండా 2’లో మురళి, సురేఖ దంపతుల కుమార్తె సుష్మిత పాత్ర ఉంటుంది. ‘కొండా’ సినిమాలో ఓ టైమ్‌ పీరియడ్‌, గెటప్‌ తీసుకోవడం వల్ల ఆమె పాత్ర లేదు. మురళి అన్న చేసిన రిస్క్‌ వల్ల నా కెరీర్‌లో డిఫరెంట్‌ సినిమా తీశానని నమ్మకం ఉంది. మార్చిలో సినిమాను విడుదల చేస్తాం’’ అని అన్నారు.  




Updated Date - 2022-01-26T23:30:42+05:30 IST