పునీత్‌ మృతి.. కోలీవుడ్‌ అందుకే దూరంగా ఉందా?

ABN , First Publish Date - 2021-11-03T00:02:41+05:30 IST

కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణం యావత్‌ సినీ పరిశ్రమల్లోనూ విషాదం నింపింది. పునీత్‌ పేరుకు కన్నడ హీరో అయినా అన్ని ఇండస్ట్రీల హీరోలతో సత్సంబంధాలు కొనసాగించేవారు. పునీత్‌ మరణ వార్త తెలుసుకున్న టాలీవుడ్‌, కోలీవుడ్‌ సహా ఎంతోమంది ప్రముఖులు దిగ్ర్భాంతికి లోనయ్యారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యాంతమయ్యారు.

పునీత్‌ మృతి.. కోలీవుడ్‌ అందుకే దూరంగా ఉందా?

పునీత్‌ మృతి.. కోలీవుడ్‌ అందుకే దూరంగా ఉందా? 

కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణం యావత్‌ సినీ పరిశ్రమల్లోనూ విషాదం నింపింది.  పునీత్‌ పేరుకు కన్నడ హీరో అయినా అన్ని ఇండస్ట్రీల హీరోలతో సత్సంబంధాలు కొనసాగించేవారు. పునీత్‌ మరణ వార్త తెలుసుకున్న టాలీవుడ్‌, కోలీవుడ్‌ సహా ఎంతోమంది ప్రముఖులు దిగ్ర్భాంతికి లోనయ్యారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యాంతమయ్యారు. టాలీవుడ్‌ నుంచి చిరంజీవి, వెంకటేశ్‌, ఎన్టీఆర్‌, శ్రీకాంత్‌లాంటి హీరోలు, లక్షాలాదిమంది అభిమానులు బెంగళూరు చేరుకొని పునీత్‌కు నివాళులర్పించారు. అయితే తమిళ ఇండస్ట్రీ నుంచి ఒక్క హీరో కూడా హాజరుకాలేదు.


సూర్య, విశాలు, కార్తీ, విజయ్‌ వంటి హీరోలతో పునీత్‌కి మంచి ేస్నహం ఉంది. అయినా వారెవ్వరూ పునీత్‌ కడసారి చూపునకు హాజరు కాలేదు. యువ హీరోల్లో శివ కార్తికేయన్‌ మాత్రం సోమవారం పునీత్‌ సమాధిని సందర్శిఃచారు. అయితే కోలీవుడ్‌ స్టార్స్‌ ఎవరూ హాజరు కాకపోవడానికి కావేరీ జలాల సమస్య కారణం అని తెలుస్తోంది, చాలా ఏళ్లుగా కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరీ జలాల వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే! ఈ మధ్యకాలంలో తమిళ సినిమాలను కర్ణాటకలో విడుదల చేయకూడదని  కన్నడ హీరోలు నినాదాలు చేశారు. పునీత్‌ అంత్యక్రియలకు హాజరైతే రాజకీయంగా  పలు ఇబ్బందులు ఎదురువుతాయనే ఉద్దేశంతోనే కోలీవుడ్‌ స్టార్‌లు హాజరు కాలేదనే వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 


Updated Date - 2021-11-03T00:02:41+05:30 IST