రెండో పెళ్లి చేసుకోబోతోన్న మ్యూజిక్ డైరెక్టర్ ఇమ్మాన్.. వధువు ఎవరంటే..!
ABN , First Publish Date - 2022-03-05T22:36:54+05:30 IST
సంగీతంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నమ్యూజిక్ డైరెక్టర్

సంగీతంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ డి. ఇమ్మాన్. కోలీవుడ్‌లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు. అతడు కంప్యూటర్ ఇంజినీర్ అయిన మోనికా రిచర్డ్‌ను 2008లో పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఏమైందో తెలియదు కానీ, ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్టు గతేడాది డిసెంబర్ 29న ప్రకటించారు. ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా అప్పట్లోనే ఇమ్మాన్ ఓ మెసేజ్‌ను తన అభిమానులతో పంచుకున్నాడు.
‘‘నా శ్రేయస్సును కోరేవారు, నా సంగీతాన్ని ఇష్టపడేవారు ఎంతోకాలంగా నాకు మద్దతుగా నిలుస్తున్నారు. అందుకు నేను ఎంతో రుణపడి ఉంటాను. జీవితం మనల్ని వేర్వేరు దారుల్లో తీసుకువెళుతుంది. నేను, మోనిక 2020, నవంబర్‌లో ఒకరి అంగీకారంతో మరొకరం విడాకులు తీసుకున్నాం. మేం భార్య, భర్తలుగా ఏ మాత్రం ఉండలేం. మాకు ప్రైవసీ ఇవ్వాలని, జీవితంలో ముందుకు వెళ్లేందుకు సహాయపడాలని మీడియాను కోరుతున్నాం. మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు’’ అని ఇమ్మాన్ పేర్కొన్నాడు. విడాకుల ప్రకటన చేసి మూడు నెలలు కాక ముందే ఇమ్మాన్ మరో పెళ్లిని చేసుకొవాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం.
అతడు ఈ ఏడాది మేలో రెండో పెళ్లిని చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. చెన్నైకి చెందిన ఉమ అనే వ్యక్తిని అతడు వివాహమాడనున్నట్టు కోలీవుడ్ మీడియా తెలుపుతోంది. ఈ పెళ్లికి దగ్గరి బంధువులతో పాటు సన్నిహితులు మాత్రమే హాజరుకాబోతున్నట్టు సమాచారం. ఈ వేడుకకు సంబంధించిన వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘పెద్దన్న’, అజిత్ నటించిన ‘విశ్వాసం’ సినిమాలకు ఇమ్మానే సంగీతం అందించాడు. ప్రస్తుతం సూర్య హీరోగా నటించిన ‘ఎవరికీ తలవంచకు’ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.