Kiran Abbavaram : ‘వినరో భాగ్యము విష్ణుకథ’ అంటున్నాడు

ABN , First Publish Date - 2022-01-07T17:47:46+05:30 IST

‘రాజావారు రాణి వారు, యస్.ఆర్.కళ్యాణ మండపం’ లాంటి సినిమాలతో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఈ రెండు సినిమాల సక్సెస్ క్రెడిట్ తో టాలీవుడ్ లో పెద్ద బ్యానర్స్ నుంచి అతడికి వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ‘గీతా ఆర్ట్స్ 2’ బ్యానర్ పై బన్నీ వాస్.. కిరణ్ హీరోగా ఓ వెరైటీ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. సినిమాకి ‘వినరో భాగ్యము విష్ణుకథ’ అనే ఆసక్తికరమైన టైటిల్ ను కూడా ఖాయం చేశారు.

Kiran Abbavaram : ‘వినరో భాగ్యము విష్ణుకథ’ అంటున్నాడు

‘రాజావారు రాణి వారు, యస్.ఆర్.కళ్యాణ మండపం’ లాంటి సినిమాలతో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఈ రెండు సినిమాల సక్సెస్ క్రెడిట్ తో టాలీవుడ్ లో పెద్ద బ్యానర్స్ నుంచి అతడికి వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ‘గీతా ఆర్ట్స్ 2’ బ్యానర్ పై బన్నీ వాస్.. కిరణ్ హీరోగా ఓ వెరైటీ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. సినిమాకి ‘వినరో భాగ్యము విష్ణుకథ’ అనే ఆసక్తికరమైన టైటిల్ ను కూడా ఖాయం చేశారు.


మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. టైటిల్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఒక పక్కగుడి, మరో పక్క మసీదు మధ్యలో గ్రామీణ వాతావరణం కనిపిస్తున్నాయి. ‘హెల్పింగ్ నేచర్ బిగిన్స్’ అని పోస్టర్ పై మెన్షన్ చేశారు. ‘మానవ సేవే మాధవ సేవ’ అనే సూక్తి ఆధారంగా ఈ సినిమా కథాంశం ఉంటుందని అర్ధమవుతోంది. అతి త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతోంది. 



Updated Date - 2022-01-07T17:47:46+05:30 IST