నా సినిమా టీజర్, ట్రైలర్‌లో కంటెంట్ నచ్చితేనే సినిమాకు రండి: కిరణ్ అబ్బవరం
ABN , First Publish Date - 2022-03-03T04:23:46+05:30 IST
నాకు సినిమా అంటే ఇష్టం, ప్రాణం దానిని గుర్తించాడు మా అన్న. ఎక్కడో ఊర్లో టికెట్ కొనుక్కొని సినిమా చూసే నన్ను ఈ రోజు హీరోని చేశాడు. తను ఈ రోజు మా మధ్య లేనందుకు చాలా బాధగా ఉంది. తను కోరుకున్న విధంగానే నేను ఇంకా ఎక్కువగా కష్టపడి

కిరణ్ అబ్బవరం హీరోగా నైట్ బ్లైండ్‌నెస్(రేచీకటి) నేపథ్యంలో తెరకెక్కిన కామెడీ థ్రిల్లర్ ‘సెబాస్టియన్ పిసి524’. ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో జ్యోవిత సినిమాస్ పతాకంపై బి. సిద్దారెడ్డి నిర్మించారు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. నువేక్ష(నమ్రతా దారేకర్), కోమలి ప్రసాద్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ‘సెబాస్టియన్ పిసి524’ మొదటి బిగ్ టికెట్‌ను హీరోలు అడవి శేష్, ఆకాష్ పూరిలు విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి వచ్చి.. మా చిత్రయూనిట్‌ని ఆశీర్వదించిన వారందరికీ నా ధన్యవాదాలు. నాకు ఇండస్ట్రీలో ఒక అవకాశం విలువ ఏంటో తెలుసు. ఆ అవకాశం కెమెరా ముందు నిల్చోవడమే అదృష్టంగా.. అదొక వరంగా భావిస్తున్నాను. మన ఇంటికి ఒక గెస్ట్ వస్తే వారిని ఎంతో బాగా చూసుకుంటాం. అలాంటిది మన కోసం థియేటర్స్‌కు వచ్చి డబ్బులు ఖర్చు పెట్టి సినిమా చూసే ప్రేక్షకులను నిరాశ పరచకూడదని చక్కటి కథను సెలెక్ట్ చేసుకొని ఈ సినిమా తీయడం జరిగింది. ఈ సినిమా కోసం 24 క్రాఫ్ట్స్ అందరూ కూడా నిద్రలేకుండా పని చేశారు. ఈ సినిమా చూసిన తరువాత ప్రేక్షకులందరూ కూడా చాలా మంచి సినిమా చేశారని మెచ్చుకుంటారు. అలాగే ఈ సినిమాకోసం కష్టపడిన సెబాస్టియన్ టీం కు రెస్పెక్ట్ ఇస్తారని నమ్ముతున్నాను. ఈ మధ్య విడుదల చేసిన ట్రైలర్‌కు చాలా మంచి స్పందన వచ్చింది.
ఈ సినిమా చూసిన అందరూ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అతి తక్కువ సమయంలోనే జిబ్రాన్ వంటి సంగీత దర్శకుడు నా సినిమాకు పనిచేస్తారు అనుకోలేదు. తను అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. రాజు, ప్రమోద్ అన్నలు.. మా సిద్దారెడ్డి మామ నాకెంతో సపోర్ట్‌గా నిలిచారు. ఈ సినిమా ఆగి పోకూడదని చాలా కష్టపడి ఈ సినిమాను పూర్తి చేశారు. నాకు సినిమా అంటే ఇష్టం, ప్రాణం దానిని గుర్తించాడు మా అన్న. ఎక్కడో ఊర్లో టికెట్ కొనుక్కొని సినిమా చూసే నన్ను ఈ రోజు హీరోని చేశాడు. తను ఈ రోజు మా మధ్య లేనందుకు చాలా బాధగా ఉంది. తను కోరుకున్న విధంగానే నేను ఇంకా ఎక్కువగా కష్టపడి మంచి సినిమాలు చేస్తూ ఆయనకు మంచి పేరు తీసుకువస్తాను. ప్రతి ఒక్కరికీ నేను చెప్పేది ఒక్కటే.. నేను తీసే ఏ సినిమా అయినా టీజర్, ట్రైలర్‌లో కంటెంట్ నచ్చితేనే సినిమాకు రండి. ఇప్పుడు చేసిన సెబాస్టియన్ కూడా అందరికీ తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమా తర్వాత ఆరు సినిమాలు చేస్తున్నాను. ఆ చిత్రాల నిర్మాతలందరూ నన్ను ఎంతగానో నమ్మారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయను. చివరిగా నేను ఒక్కటి చెప్పగలను.. మార్చి 4న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా ‘సెబాస్టియన్ పిసి524’ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా మంచి సినిమా చూశాము అనే ఫీలింగ్‌తో బయటికి వస్తారు’’ అని తెలిపారు.
