The Ghost: షూటింగ్ పూర్తి.. మరో ‘విక్రమ్’ రెడీ అవుతున్నాడు

ABN , First Publish Date - 2022-08-08T23:49:59+05:30 IST

కింగ్ అక్కినేని నాగార్జున (Nagarjuna), క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) కాంబినేషన్‌లో రూపొందుతోన్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ఘోస్ట్’ (The Ghost). మునుపెన్నడూ చూడని పాత్రలో

The Ghost: షూటింగ్ పూర్తి.. మరో ‘విక్రమ్’ రెడీ అవుతున్నాడు

కింగ్ అక్కినేని నాగార్జున (Nagarjuna), క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) కాంబినేషన్‌లో రూపొందుతోన్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ఘోస్ట్’ (The Ghost).  మునుపెన్నడూ చూడని పాత్రలో పవర్ ఫుల్ ఇంటర్‌పోల్ ఆఫీసర్‌ విక్రమ్‌ (Vikram)గా ఈ చిత్రంలో నాగార్జున కనిపించబోతున్నారు. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై సునీల్ నారంగ్‌తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుందని తెలుపుతూ.. మేకర్స్ ఓ స్పెషల్ వీడియోని, అలాగే ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ వీడియోలో నాగార్జున గన్ ఫైరింగ్ చేస్తూ కనిపించారు. అలాగే విడుదల చేసిన పోస్టర్‌లో నాగార్జున, సోనాల్ చౌహాన్‌ (Sonal Chauhan)లు ఒక పెద్ద జీప్ దగ్గర ఇంటర్‌పోల్ అధికారులుగా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌లో వారి లుక్  అల్ట్రా-స్టైలిష్‌గా ఉంది. అలాగే వారి దగ్గర వున్న మెషిన్ గన్‌లను చూస్తుంటే భారీ యాక్షన్‌కి రెడీ అవుతున్నట్లుగా అర్థమవుతోంది.


ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఘోస్ట్-కిల్లింగ్ మెషిన్ భారీ స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఇంటర్‌పోల్ ఆఫీసర్‌ విక్రమ్‌గా నాగార్జున యాక్షన్ మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ప్రత్యేకంగా రూపొందించిన యాక్షన్ బ్లాక్‌ అందరినీ ఆకట్టుకుంది. భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది. నాగార్జున కల్ట్ క్లాసిక్, పాత్ బ్రేకింగ్ మూవీ ‘శివ’ (Shiva) చిత్రం కూడా 1989లో అదే తేదీన విడుదలైంది. గుల్ పనాగ్ (Gul Panag), అనిఖా సురేంద్రన్ (Anikha Surendran) కీలక పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ స్పెషలిస్ట్ మార్క్ కె. రాబిన్ (Mark K Robin) సంగీతం అందిస్తున్నారు.





Updated Date - 2022-08-08T23:49:59+05:30 IST