Vikrant Rona box office collections: బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న సుదీప్ సినిమా

ABN , First Publish Date - 2022-08-02T02:08:17+05:30 IST

పాత్ర నచ్చితే భాషతో సంబంధం లేకుండా ఏ ఇండస్ట్రీలో అయినా సినిమాలు చేసే నటుడు కిచ్చా సుదీప్ (Kiccha Sudeep). రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ తో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. తాజాగా సుదీప్

Vikrant Rona box office collections: బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న సుదీప్ సినిమా

పాత్ర నచ్చితే భాషతో సంబంధం లేకుండా ఏ ఇండస్ట్రీలో అయినా సినిమాలు చేసే నటుడు కిచ్చా సుదీప్ (Kiccha Sudeep). రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ తో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. తాజాగా అతడు నటించిన సినిమా ‘విక్రాంత్ రోణ‌’(Vikrant Rona). ఈ చిత్రం పాన్ ఇండియాగా రూపొందింది. థియేటర్స్‌లో జులై 28న విడుదలైంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. ఫస్ట్ వీకెండ్ ముగిసే నాటికి వరల్డ్ వైడ్‌గా రూ.115కోట్ల నుంచి రూ. 120కోట్ల వరకు వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.   


‘విక్రాంత్ రోణ’ నాలుగో రోజు రూ. 29కోట్ల కలెక్షన్స్‌ను కొల్లగొట్టిందని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ సినిమా రూ. 110కోట్లకు పైగా వసూళ్లను దాటనుందని తెలుస్తోంది. ‘షంషేరా’ ఫస్ట్ వీక్‌లో రూ. 40కోట్ల కలెక్షన్స్‌ను మాత్రమే సాధించింది. ‘విక్రాంత్ రోణ’ లో నిరుప్ భండారీ, నీతా అశోక్ కీలక పాత్రలు పోషించారు. జాక్ మంజునాథ్ నిర్మాతగా వ్యవహరించాడు. అనుప్ భండారీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను రూ. 95కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించారు. కర్ణాటకలో ‘కెజియఫ్-2’ తర్వాత అత్యధిక నెట్ కలెక్షన్స్ సాధించిన చిత్రం ‘విక్రాంత్ రోణ’. ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’, ‘కెజియఫ్-2’ వంటి దక్షిణాది సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టాయి. అనంతరం ‘విక్రాంత్ రోణ’ వస్తుండటంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీని 3డీలో కూడా విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా 55దేశాల్లో 14భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. 

Updated Date - 2022-08-02T02:08:17+05:30 IST