Vikrant Rona Collections: సుదీప్ సినిమా కలెక్షన్స్‌లో ఊహించని పరిణామం.. మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు..

ABN , First Publish Date - 2022-07-30T20:58:58+05:30 IST

భాషతో సంబంధం అన్ని ఇండస్ట్రీస్‌లో కొత్త రకం పాత్రలు చేసే నటుడు కిచ్చా సుదీప్ (Kiccha Sudeep). రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ తో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. తాజాగా ‘విక్రాంత్ రోణ‌’(Vikrant

Vikrant Rona Collections: సుదీప్ సినిమా కలెక్షన్స్‌లో ఊహించని పరిణామం.. మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు..

భాషతో సంబంధం అన్ని ఇండస్ట్రీస్‌లో కొత్త రకం పాత్రలు చేసే నటుడు కిచ్చా సుదీప్ (Kiccha Sudeep). రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ తో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. తాజాగా ‘విక్రాంత్ రోణ‌’(Vikrant Rona) లో నటించాడు. ఈ చిత్రం పాన్ ఇండియాగా రూపొందింది. థియేటర్స్‌లో జులై 28న విడుదలైంది. హిందీలో ఈ చిత్రానికీ సల్మాన్ ఖాన్ సమర్పకుడిగా వ్యవహరించాడు. ఈ మూవీకీ మొదటి రోజు భారీ స్థాయిలో ఒపెనింగ్స్ రాగా రెండో రోజే బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. 


‘విక్రాంత్ రోణ’ ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ. 26.49కోట్ల వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. రెండో రోజు మాత్రం రూ. 12కోట్ల నుంచి రూ. 14కోట్ల కలెక్షన్స్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా కర్ణాటకలో ‘కెజియఫ్-2’ తర్వాత రూ. 20కోట్ల నెట్ కలెక్షన్స్ సాధిస్తుందని అందరు అంచనా వేశారు. కానీ, ఆ అంచనాలు తప్పి రూ. 18కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టింది. ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’, ‘కెజియఫ్-2’ తర్వాత భారీ అంచనాల మధ్య విడుదలైన పాన్ ఇండియా చిత్రం ‘విక్రాంత్ రోణ’. ఈ మూవీని 3డీతో కూడా విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా 55దేశాల్లో 14భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.  

Updated Date - 2022-07-30T20:58:58+05:30 IST