భాషతో సంబంధం అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేసే నటుడు కిచ్చా సుదీప్ (Kiccha Sudeep). రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ తో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. తాజాగా ‘విక్రాంత్ రోణ’(Vikrant Rona) లో నటించాడు. ఈ చిత్రం పాన్ ఇండియాగా రూపొందింది. ఈ సందర్భంగా అతడు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆసక్తికర కబుర్లను అభిమానులతో పంచుకున్నాడు. తాను సల్మాన్ ఖాన్‌ను డైరెక్షన్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నాడు.
సినిమా చేయడానికీ గత ఏడాది నుంచే ప్రయత్నాలు ప్రారంభించినట్టు కిచ్చా సుదీప్ చెప్పాడు. అందుకు మరికొంత సమయం కావాలన్నాడు. ‘‘నేను సల్మాన్ ఖాన్‌కు కథను వినిపించాలి. అందుకు అతడు అంగీకరించాలి. అనంతరం ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లాలి. సినిమా కథల కోసం సల్మాన్ ఖాన్ అనేక మందితో చర్చలు జరుపుతున్నారు. కథల గురించి మేమిద్దరం కూడా చర్చిస్తున్నాం’’అని కిచ్చా సుదీప్ చెప్పాడు. ‘విక్రాంత్ రోణ’ను హిందీలో సల్మాన్ ఖానే సమర్పిస్తున్నాడు. సల్లూ భాయ్ సినిమాకు సంబంధించిన 18నిమిషాల ఫుటేజ్‌ను చూశాడని సుదీప్ పేర్కొన్నాడు. ‘‘ఆ ఫుటేజ్ అతడికి ఎంతగానో నచ్చడంతోనే సమర్పించేందుకు అంగీకరించాడు. మేమిద్దరం కలసి ‘దబాంగ్-3’ (Dabangg 3)లో నటించాం. అతడితో నాకు మంచి రిలేషన్షిప్ ఉంది. దీంతో చిత్రాన్ని సమర్పించేందుకు ముందుకు వచ్చాడు’’ అని సుదీప్ పేర్కొన్నాడు.