‘వినయ విధేయ రామ‘లో నటించి... మర్యాద మరచిన హీరోయిన్‌పై విమర్శల వెల్లువ!

Twitter IconWatsapp IconFacebook Icon
వినయ విధేయ రామలో నటించి... మర్యాద మరచిన హీరోయిన్‌పై విమర్శల వెల్లువ!

తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాలలో నటించిన బాలీవుడ్ భామ కియారా అద్వానీ తన వింత చేష్టలతో తరచూ విమర్శలకు గురవుతుంటుంది. తాజాగా మరోమారు కియారా విమర్శకుల నోళ్లలో నానుతోంది. నటుడు సిద్దార్థ మల్హోత్రా పక్కన తరచూ కనిపించే కియారా ఈ రిలేషన్ గురించి ఎప్పుడూ చెప్పలేదు. అయితే ఇప్పుడు కియారా.. సిద్దార్థ్ ఇంటి ముందు ఫొటోకు దొరికిపోయింది. ఆమె కారు డోరును ఒక వృద్ధుడు తెరుస్తున్న ఫొటో వైరల్‌గా మారింది. 

ఆ వృద్ధుడు కారు డోరు తెరిచిన వెంటనే... ఆమె కారు నుంచి దిగి వేగంగా ఆ బిల్డింగ్ లోనికి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని గమనించిన నెటిజనులు కియారాపై మండిపడుతున్నారు. ఒక యూజర్.. కారు డోరు కూడా ఆమె తీసుకోలేదా? సెలబ్రిటీలు తాము చాలా గొప్పవాళ్లుగా భావిస్తుంటారని పేర్కొనగా, మరొక యూజర్... తండ్రికన్నా పెద్ద వయసులో ఉన్నారు, అతని చేత కియారా ఇలా చేయించుకోవడం సరికాదన్నారు.

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.