Raviteja : ‘ఖిలాడీ’ టాకీ పార్ట్ పూర్తి

ABN , First Publish Date - 2021-09-26T16:48:32+05:30 IST

మాస్ మహారాజా రవితేజ.. ఈ ఏడాది సంక్రాంతికి ‘క్రాక్’ మూవీతో భారీ హిట్ సొంతం చేసుకొన్నారు. ఆ ఉత్సాహంతోనే తన తదుపరి చిత్రాల్ని వరుసగా ట్రాక్ ఎక్కించారు.

Raviteja : ‘ఖిలాడీ’ టాకీ పార్ట్ పూర్తి

మాస్ మహారాజా రవితేజ.. ఈ ఏడాది సంక్రాంతికి  ‘క్రాక్’ మూవీతో భారీ హిట్ సొంతం చేసుకొన్నారు. ఆ ఉత్సాహంతోనే తన తదుపరి చిత్రాల్ని వరుసగా ట్రాక్ ఎక్కించారు. ప్రస్తుతం రవితేజ రమేశ్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’, కొత్త దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాలు చిత్రీకరణ దశలో ఉండగా.. వాటిలో ‘ఖిలాడీ’ చిత్రానికి రెండు పాటలు మినహా టాకీ పార్ట్ కంప్లీట్ అయినట్టు నిర్మాతలు ప్రకటించారు.  రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ  మూవీలో డింపుల్ హయతి, మీనాక్షీ చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. పెన్ స్డూడియోస్ సమర్ఫణలో హవీష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. 


ఇప్పటికే విడుదలైన ‘ఖిలాడీ’ మూవీ ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లిమ్స్, ఫస్ట్ సింగిల్స్ కి మంచి స్పందన లభించింది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ గా నటిస్తుండగా.. మలయాళ యంగ్ స్టార్ ఉన్నిముకుందన్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇంకా రావు రమేశ్, ముఖేశ్ రుషి, వెన్నెల కిషోర్ , అనసూయ, మురళీ శర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మిగిలిన పాటలు కూడా చిత్రీకరణ పూర్తి చేసి..  అతి త్వరలో ఈ సినిమాను థియేటర్స్ లోనే విడుదల చేయబోతున్నారు. ‘క్రాక్’  తర్వాత రవితేజ నటిస్తున్న సినిమా అవడంతో .. ‘ఖిలాడీ’ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా రవితేజకి ఏ స్థాయి హిట్టిస్తుందో చూడాలి. 


Updated Date - 2021-09-26T16:48:32+05:30 IST