Khiladi : ఫుల్‌కిక్‌ తో నాలుగో సింగిల్ వచ్చేస్తోంది

ABN , First Publish Date - 2022-01-19T20:24:28+05:30 IST

మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఖిలాడి’. రవితేజ ద్విపాత్రాభినయం చేయబోతున్న ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రను యాక్షన్ కింగ్ అర్జున్ చేస్తున్నారు. పెన్ మూవీస్, ఏ స్టూడియోస్ పతాకంపై సత్యనారాయణ కోనేరు, రమేశ్ వర్మ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. దేవీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇంతకు ముందు ఈ సినిమా టీజర్, సింగిల్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Khiladi : ఫుల్‌కిక్‌ తో నాలుగో సింగిల్ వచ్చేస్తోంది

మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఖిలాడి’. రవితేజ ద్విపాత్రాభినయం చేయబోతున్న ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రను యాక్షన్ కింగ్ అర్జున్ చేస్తున్నారు. పెన్ మూవీస్, ఏ స్టూడియోస్ పతాకంపై సత్యనారాయణ కోనేరు, రమేశ్ వర్మ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. దేవీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇంతకు ముందు విడుదలైన ఈ సినిమా టీజర్, సింగిల్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 


ఫిబ్రవరి 11న ఈ సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ క్రమంలో ‘ఖిలాడి’ చిత్రం ప్రచారాల్ని జోరుగా చేస్తున్నారు. అందులో భాగంగా నాలుగో సింగిల్ గా జనవరి 26న  ఫుల్ కిక్ అనే లిరికల్ సాంగ్ ను వదలబోతున్నారు. ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేస్తూ ట్విట్టర్ లో ప్రకటించారు మేకర్స్. పోస్టర్ ను బట్టి ఇదో ఐటెమ్ సాంగ్ అని అర్ధమవుతోంది. అందులోనూ దేవీశ్రీ సంగీతంలోని ఐటెమ్ సాంగ్ అంటే.. అదే స్థాయిలో ఉంటుందో ఊహించొచ్చు. మరి ఈ పాట ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇస్తుందేమో చూడాలి.



Updated Date - 2022-01-19T20:24:28+05:30 IST